డిసెంబర్ 11, 2013

తెలుగుతల్లికి పుత్రశోకం

Posted in సాహితీ సమాచారం at 5:34 సా. by వసుంధర

ravella-venkata-ramaraoఅచ్చతెనుగుకు సంస్కృతం జతపడితే ఆంధ్రమని వ్యవహరిస్తున్నాం. నన్నయనుంచి నారాయణరెడ్ది వరకూ తెలుగు కవులను ఆకర్షించిన భాష ఆంధ్రం. అలాంటి కవులలో కదనాన శత్రువుల కుత్తుకల నవలీల నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి ధీరులకు మొగసాలరా! తెలగాణ వీరులకు కాణాచి రా! అంటూ తెలుగు నేలను స్తుతించిన శ్రీ  రావెళ్ల వెంకట రామారావు ఆంధ్ర కవితకు గర్వకారణం. ఈ పాటను ప్రత్యేక తెలంగాణ పోరాటంలో విరివిగా ఉపయోగించుకోవడం జరిగినా, దీని భావం ప్రాంతీయతకు కట్టుబడనిది. ఆ కలం గళం నేడు మూగవోయి తెలుగుతల్లికి పుత్రశోకాన్ని కలిగించింది. తన కవితతో ఆయన చిరంజీవి అని తెలిసినా- భౌతికంగా ఆయన అస్తమయం సాహితీపరులకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఆయనకు అక్షరజాలం నివాళులు.

ravella

Leave a Reply

%d bloggers like this: