Site icon వసుంధర అక్షరజాలం

సాహస బాలిక గుంజన్

అస్సాంలో శివసాగర్ జిల్లాలో సిమాలుగిరి అనే పట్నం నడిబొడ్డున నజిరా కేంద్రీయ విద్యాలయం. అక్కణ్ణించి 11గురు పసివాళ్లని ఇంటికి తీసుకెడుతున్నవ్యాన్. తుపాకిని చేతబట్టిన ఓ దుండగుడు, తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో ఆ వ్యాన్‍నుంచి ఓ పసిపాప్ని తీసుకుని పలాయనమయ్యాడు.  ఆ పాప భయంతో గోల పెడుతుంటే చూసింది 14 సంవత్సరాల గుంజన్ అనే పాప. పసిపిల్లపై జాలితో, ‘ఆ పాపని వదులు. నేను నీతో వస్తాను” అని చెప్పింది. ఆ దుండగీడు ఆమెని తీసుకుని అస్సాం-నాగాలాండ్ సరిహద్దుల్లోని చిట్టడవిలోకి తీసుకెళ్లి వదిలాడు. అక్కణ్ణించి ఆ పాప ఎలా నడిచిందో ఏమో- మొత్తం 14 గంటలు అష్టకష్టాలూ పడి- ఓ తేనీటి పనివాడి ఇల్లు చేరుకుంది. ఈ సాహస గాథలో ధైర్యమే కాదు త్యాగ గుణంతో కూడిన మానవత్వం కూడా ఉంది. ఎందుకంటే జనాలు మసిలే పట్నాల్లోనే ఆడపిల్లలకు రక్షణ లేదు. అలాంటిది నిర్జనారణ్యానికి తన వయసు పిల్ల- ఓ సాయుధుడితో వెళ్లడం- ఈ ప్రపంచం భావిపట్ల అంతులేని ఆశను కలిగించదూ! వందనాలు గంజన్ అభివందనాలు!!  పూర్తి వివరాలకు టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో డిసెంబర్ 6 న, నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో  వచ్చిన ఈ వార్త చదవండి.

Exit mobile version