డిసెంబర్ 13, 2013

నేటి కార్టూన్- అత్త పెత్తనం

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:29 సా. by వసుంధర

ఒక ఇంటిముందు ఓ బిచ్చగాడు నిలబడి బిచ్చం అడిగాడు. ఆ ఇంటి కోడలు బిచ్చం వెయ్యను పొమ్మంది. బిచ్చగాడు వెళ్లిపోతుంటే వాడికి అప్పుడే ఎక్కణ్ణించో ఆఇంటికే వస్తున్న అత్త ఎదురయింది. విషయం తెలుసుకుని, ‘బిచ్చం వెయ్యననడానికి అదెవరు? ఆ ఇంటికి నాదీ పెత్తనం. పద’ అని వాణ్ణి తన ఇంటికి తీసుకెళ్లింది. కోడల్ని పిలిచి బిచ్చగాడి ముందే కోడల్ని జరిగిందానికి తప్పు పట్టి బాగా తిట్టింది. తర్వాత ఆశగా ఎదురుచూస్తున్న బిచ్చగాడివైపు తిరిగి, ‘ఈ ఇంటికి యజమానురాలిగా అత్తను నేను చెబుతున్నాను. నీకు బిచ్చం వెయ్యను, ఫో’ అంది.

ఇది చిన్నప్పుడు విన్న పాతకథ. ఇప్పటికీ మన శాసనసభల్లో జరుగుతున్న నేటి కథ. ఈ క్రింది కార్టూన్ చూడండిః

cartoon dc 13 13

Leave a Reply

%d bloggers like this: