డిసెంబర్ 19, 2013
మనమూ మనదను మాటే…
మిస్సమ్మ సినిమాలో ఓ పాటలో- ‘మనమూ మనదను మాటే అననీయదు, తాననదోయ్’ అని ప్రియురాలి గురించి వాపోతాడు హీరో. అది భారత దేశంలో పౌరులకి పూర్తిగా అన్వయిస్తుందని తెల్సుతూనే ఉంది కదా! స్వలాభంతో కూడిన రాజకీయాలే తప్ప- దేశాభిమానం, భాషాభిమానం, ఆత్మగౌరవం పూర్తిగా లోపించిన మనం- సాటి పౌరుల్నీ, సాటి నేతల్నీనోటికి వచ్చినట్లు నిందిస్తూ, అవహేళన చేస్తూ- అది ప్రజాస్వామ్యం మనకిచ్చిన స్వేచ్ఛగా భావిస్తున్నాం. ఒక ప్రాంతం ప్రజలెన్నుకున్న నాయకుల్ని, మరో ప్రాంతపు ప్రజలెన్నుకున్న నాయకులు నిందించడం- ఆయా ప్రాంతాల ప్రజల్ని అవమానించడమే అని గ్రహించకపోవడం వల్లనే- నాలుగు సార్లు వరుసగా గుజరాతీయులు ఎన్నుకున్న మోడీపై మత తత్వవాదిగా ప్రచారం జరుగుతోంది. ఇక మన రాష్ట్రంలో నేతల పరస్పర నిందారోపణ, వారి భాష మనం వింటూనే ఉన్నాం. ఒకే భాష మాట్లాడుకునేవాళ్లు ఒకరినొకరు ద్రోహులని నిందించుకుంటూ- ఎక్కడివారికో ముక్కుతాళ్లు అందిస్తున్నాం. ప్రపంచంలో మనకి లభించే గౌరవం ఎలా ఉంటుందో గతంలో- మన మాజీ రాష్ట్రపతి అబుల్ కలాం, మన అభిమాన నటుడు షారూక్ ఖాన్ వగైరాలకు విమాన యానాల్లో లభించిన (అ)గౌరవం తెలియజేస్తుంది. అప్పుడు ఊరుకున్న మనం నేడు భారత ప్రతినిధి దేవయానికి అమెరికాలో జరిగిన ఘోర పరాభవానికి ఎట్టకేలకు (ఎన్నికల) ధర్మమా అని స్పందించాం.
ఏదేమైనా ప్రపంచంలో మనకున్న గౌరవమేమిటో- తెలుసుకుందుకు- నేడు డెక్కన్ క్రోనికల్లో వచ్చిన కార్టూన్, ఆంధ్ర జ్యోతి దినపత్రికలో వచ్చిన వార్త క్రింద ఇస్తున్నాం. ఐతే ఇందుకు నిరాశ చెందక్కర్లేదు. మనమూ మనదను మాటే అంటూ, అననిస్తూ సామరస్యం కోసం నిశ్శబ్దంగా కృషి చేస్తున్నవారు కూడా మనలో కొందరున్నారు. అలా మళయాళీ-తెలుగుల మధ్య సామరస్యానికి కృషి చేస్తున్నఓ మహనీయుడి గురించిన వార్త (నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక) కూడా ఈ క్రింద ఇస్తున్నాం. అటువంటివారినే మనం ఆదర్శంగా తీసుకుందాం.
Leave a Reply