డిసెంబర్ 20, 2013

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 5:30 సా. by వసుంధర

తిలాపాపం తలా పిడికెడు అని ఓ తెలుగు సామెత. ఆ వివరాల్ని చక్కగా విశ్లేషించారు శర్మ గారు తన బ్లాగులో. ప్రభుత్వం వినోదపు పన్ను పెంచిందనుకోండి. సినిమావాళ్లు టికెట్ల ధర పెంచేస్తారు. వ్యాపారస్థులమీద వ్యాట్ విధించినా, హొటళ్లపై సర్వీస్ టాక్స్ విధించినా- ఆ భారమూ ప్రజలదే. ఇప్పుడు లోక్‍పాల్ బిల్లు వచ్చింది కదా- ఘనత వహించిన మన నాయకులు ఏంచేస్తారో- నేడు దెక్కన్ క్రోనికిల్‍లో వచ్చిన ఈ కార్టూన్ సూచిస్తోంది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారా, మన శతకోటి దరిద్రాలూ ఎక్కడున్నాయో- వేరే చెప్పాలా!

cartoon dc

Leave a Reply

%d bloggers like this: