డిసెంబర్ 26, 2013

రావూరి భరద్వాజ

Posted in సాహితీవైద్యం at 8:05 సా. by వసుంధర

ravuri bharadvaja1964లో కెమిస్ట్రీలో రీసెర్చి స్కాలరుగా ఉన్నప్పుడు- సమాచార సేకరణకు రోజూ ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లేవాణ్ణి. మధ్యలో మార్పుకోసం తెలుగు విభాగానికి వెళ్లి కథా సాహిత్యాన్ని చదివేవాణ్ణి. అప్పుడు పరిచయమైన కొత్త రచయితల్లో రావూరి భరద్వాజ ఒకరు. వారి కథల్లోని విలక్షణత, సహజత్వం, నిర్భయత్వం, అంతర్లీన సందేశం- అప్పట్లో నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. కథలంటే ఇలా ఉండాలి, ఇలా వ్రాయాలి- అన్న భావాన్ని, ప్రేరణని కలిగించాయి. శృంగారపరంగా చలానిది భావుకత ఐతే- రావూరిది వాస్తవికత. విశ్లేషణలో వారిది కొడవటిగంటి స్థాయి. పరిశీలనలో సాటి ఉత్తమ రచయితలకి సాటి. అసహాయురాలైన కోడలిని కోరిన మామ, పూట గడవని స్థితిలో కూడా రాత్రి సౌఖ్యంతో సరిపెట్టుకునే దంపతులు, గొప్పవాడింటి పక్కన కొద్దివాడు, అపరిచితుడు భార్యపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే- అందుకు భార్యనే తప్పుపట్టే భర్త- అప్పట్లో మాకు దిశానిర్దేశం చేసిన కొన్ని గొప్ప కథలు. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు- కొన్ని పదులైనా చదివి- కథకుడంటే భరద్వాజ అనుకున్నానప్పుడు. ఆ రచనలకోసం ఇప్పుడు ప్రయత్నిస్తుంటే ఎక్కడా దొరకడం లేదు. ఇటీవల రావూరి వారికి జ్ఞానపీఠం లభించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తే, ఆ తర్వాత కొంత కాలానికే ఆయన కన్ను మూయడం అంతకు మించిన మనస్తాపాన్ని కలిగించింది. ఐతే అప్పటికి ఆయన వ్నయసు 86 సంవత్సరాలు కావడంతో- పండుటాకు అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆయన రచనలు నిత్యహరితాలు కాబట్టి- అవి అలభ్యమైతే పండుటాకులని సరిపెట్టుకోలేం. ఈ సందర్భంగా వారి రచనలన్నీ పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత- జ్ఞానపీఠ సత్కారంకంటే ముఖ్యమైనది. ఆ విషయాన్నితెలుసుకోవలసినవారు తెలుసుకునే అదృష్టం మనకు కలుగుతుందని ఆశిస్తూ- అక్టోబర్ 28 (2013) దినపత్రికలో వారిపై వచ్చిన వ్యాసాన్ని ఇక్కడ అందజేస్తున్నాం.

ravuri bharadvaja

2 వ్యాఖ్యలు »

  1. Sivakumar Tadikonda said,

    His book “lOkaMkOsaM” – a compilation of some of the short stories – is available on line –
    https://archive.org/details/lokamkosam021008mbp

    Sivakumar

    • మేము చదివిన కథలు ఇందులో లేవు. ఐతేనేం అందరూ చదివి తీరాల్సిన మంచిపుస్తకానికి దారి చూపించారు. ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: