డిసెంబర్ 31, 2013

మహానటుడు జగ్గయ్య

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:52 సా. by వసుంధర

jaggayya photoజల్సారాయుడు (1959) చిత్రంలో కిషోర్ కుమార్ (హిందీ చిత్రం జాల్‍సాజ్‍కి తెలుగుసేత పాత్ర ధరించి ఒప్పించాడు. ఆత్మబలం చిత్రంలో సైకో పాత్రలో జీవించాడు. ఎన్టీఆర్, ఎయ్న్‍ఆర్ వంటి అసామాన్యుల పక్కన నటించి వారికంటే మిన్న అనిపించుకున్నాడు. నవ్వించగలడు, ఏడ్పించగలడు. పలు  పాత్రల్లో నటించినా హీరో అనే అనిపించుకున్నాడు. అనుపమ వారి చిత్రాల హీరో కావడంవల్లనే కాదు- ప్రతిభ కారణంగా కూడా అనుపమ హీరో ఆయన. కలం పట్టి మహాకవి అనిపించుకున్నాడు. గళం విప్పి కంచుకంఠంతో శివాజీ గణెశన్ వంటి మహానటుణ్ణి తెలుగువారికి ప్రీతిపాత్రుణ్ణి చేశాడు (మనోహర).  వ్యాపారాత్మక చిత్రాల్లో నటిస్తూనే పదండి ముందుకు చిత్రాన్ని నిర్మించి తన ఉత్తమాభిరుచిని నిరూపించుకున్నాడు. చలనచిత్రరంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ- వివాదాస్పదుడు కాలేకపోయిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనది. ఆయన ఒకే ఒక జగ్గయ్య! ఆయనపై ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ చిన్ని వ్యాసాన్ని మీ ముందుంచుతున్నాం.

jaggayya

1 వ్యాఖ్య »

  1. CS Sarma said,

    As you said వివాదాస్పదుడు కాలేకపోయిన మహోన్నత వ్యక్తిత్వం జగ్గయ్యది.


Leave a Reply

%d bloggers like this: