జనవరి 1, 2014

శుభాకాంక్షలు

Posted in Uncategorized at 5:12 సా. by వసుంధర

2013 వెళ్లిపోయింది. 2014 వచ్చింది. కొత్త సంవత్సరం రాగానే- ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి అనుకునేవారు కొందరు. ఇవి చెయ్యండి, అవి చెయ్యండి అనేవారు కొందరు. ఐతే కొత్త సంవత్సరమంటే నిన్నటికి మరో రేపు అని అందరికీ తెలుసు. కొత్త సంవత్సరాన్ని జనవరికి బదులు ఫిబ్రవరితో మొదలెడితే- ఈ రోజు అతి సాధారణమైనదే కదా!

మనిషికి భావిపట్ల విపరీతమైన ఆశ, కుతూహలం. అందుకే కొత్త సంవత్సరానికి ఒక రోజుని నిర్ణయించుకున్నాం. అది ఈ రోజు. మన భావి ఎప్పుడూ ఆశాజనకమే. పార్టీలకు అతీతంగా హేతుబద్ధంగా చూస్తే- ఈ సంవత్సరానికి ఆశాజ్యొతిగా రాజధానిలో కేజ్రీవాల్, దేశంలో మోదీ కనిపిస్తున్నారు.  యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతు భారత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న పరమాత్మ మాటకి నిదర్శనాలు- 1947-2013 మధ్యలో మనకి పలుమార్లు కనిపించాయి. ఇప్పుడూ కనిపిస్తాయి. ఎందుకంటే మన తప్పులు మనకి తెలుస్తున్నాయి. అదే కదా- ప్రగతికి మూలం!

అక్షరజాలం వీక్షణాలు రెండు లక్షలు దాటాయి. మన వీక్షకులు సహృదయులు, అభిజ్ఞులు. వారికి శుభాకాంక్షలు చెప్పడం మనని మనమే దీవించుకున్నట్లు!

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ- నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఆశావహమైన ఈ క్రింది వార్తల్నీ, శ్రీదేవి మురళీధర్ సౌజన్యంతో  ఓ సరదా కార్టూన్‍ని మీతో పంచుకుంటున్నాం.

telugu new ministry cartoon ajWay to go

Leave a Reply

%d bloggers like this: