జనవరి 6, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 10:05 సా. by వసుంధర

కొత్త రాజుని ఎన్నుకునేందుకు పట్టపుటేనుగుకి పూలహారాన్నిచ్చే సంప్రదాయం ఒకప్పుడు మనకుండేది. ఆ ఏనుగు ఎవరి మెడలో హారం వేస్తే వారు రాజుగా సింహాసనం అధిష్ఠిస్తారు. 21 ఏళ్ల వయసు దాటినవారందరూ విజ్ఞులేనని నమ్మే నేటి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు ఆ ఏనుగులాంటివారే ఔతారు. వారి ఎన్నికలో మన ప్రజలు నెహ్రూకి, ఇందిరకి చెరో 17 సంవత్సరాలు, రాజీవ్‍కి ఐదు సంవత్సరాలు, మన్‍మోహన్‍కి 10 సంవత్సరాలు ఇచ్చి తమ విజ్ఞతను ప్రదర్శించారు. ఢిల్లీకి ఇటీవల కేజ్రీవాల్‍ని ఎన్నుకునేందుకు సహకరించిన విజ్ఞతకు ఈ నేపథ్యాన్నికూడా జోడించి అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఆ విషయాన్నిహెచ్చరించే నేటి కార్టూన్ ఆంధ్రభూమిలో వచ్చింది. కేజ్రీవాల్ తన వాగ్దానాల్ని నెరవేర్చడం ఎంత సులభమో – సలహాగా ఇస్తుంది నేడు  Deccan Chronicle  లో వచ్చిన మరో కార్టూన్! ఆ కార్టూనిస్టులకి అభినందనలు.

 cartoon ab cartoon dc

Leave a Reply

%d bloggers like this: