జనవరి 9, 2014

చిటపట చినుకులు

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:57 సా. by వసుంధర

జగపతివారి చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉండే ఆ రోజుల్లో- ఆత్మబలం  చిత్రం ఓ విశిష్టతను సంతరించుకుంది. మనోవిశ్లేషణాత్మక చిత్రంగా రూపొందించడంలో, ఉత్కంఠ రేకెత్తించడంలో- దర్శకుడు వి. మధుసూదనరావు ఉన్నత శిఖరాలు చేరుకున్న చిత్రమిది. నటనపరంగా మానసిక రోగిగా జగ్గయ్య నభూతో నభవిష్యతి అనిపించాడు. అక్కినేని కంటే ఎక్కువగా జగ్గయ్యే గుర్తుండిపోయే చిత్రమిది. గ్లామరులో బి. సరోజాదేవి అగ్రస్థానానికి చేరుకుంది. పదాలకంటే భావానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే ఆత్రేయ- ఈ చిత్రంలో అటు అర్థానికీ, ఇటు భావానికీ అటు పదజాలానికీ సమన్వయం కలిగిస్తూ- సృష్టించిన చిటపట చినుకులు పాట ప్రణయ గీతాల్లో ఒక అద్భుతం. ఆ పాట చిత్రీకరణ ఆ రోజుల్లో ఒక సాహసం. ఆత్మబలం చిత్రానికిప్పుడు యాబై ఏళ్లట. ఆ సందర్భంగా నేడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసాన్ని ఈ క్రింద ఇస్తున్నాం. అంతకంటే ఎక్కువ వివరాలున్న మరో వ్యాసానికి (నేటి సాక్షి దినపత్రికలో వచ్చింది) ఇక్కడ లంకె ఇస్తున్నాం.

chitapata chinukulu 

Leave a Reply

%d bloggers like this: