చిన్నప్పుడు మా తాతగారు మా బంధువులబ్బాయికి మెడిసిన్లో సీటు రానప్పుడు- ‘ఒరేయ్- ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకంకోసం విపరీతంగా ప్రజల సొమ్ము ఖర్చు చేస్తోంది. నీ ఒక్కడికి మెడిసిన్లో సీటిస్తే ఆ ఖర్చంతా ఆదా ఔతుందని వాళ్లకి తెలిసినట్లు లేదురా’ అని జోక్ చేసేవారు. జనాభాని అరికట్టడానికి ప్రభుత్వం ఎంచుకున్నసాధనాల గురించి కూడా చాలామందికి ఈ తరహా ఆలోచనలు తడుతున్నట్లు అనిపిస్తుంది- నేడు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ క్రింది కార్టూన్ చూస్తే!
ఆనక రైల్వే శాఖ ఇచ్చే నష్టపరిహారం ఎవరికి చెందాలో కూడా రాసివ్వండి సార్