జనవరి 9, 2014
సాహిత్యప్రస్థానం
ఈ క్రింది సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్కి ధన్యవాదాలు.
సాహిత్యాభిమానులకు/రచయితలకు
నమస్కారం
సాహిత్య ప్రస్థానం మాసపత్రిక 2002 నుండి వెలువడుతూ తెలుగు సాహిత్యక్షేత్రంలో తనకంటూ విశిష్టతను సంపాదించుకున్నది. ఔత్సాహికుల రచనలకు ప్రోత్సాహాన్ని అందిస్తూనే సీనియర్ రచయితల రచనలకూ సిసలైన వేదికగా అలరారుతున్నది. విస్తరిస్తున్న ఇంటర్నెట్ అవకాశాలనూ అందిపుచ్చుకుని వెబ్సైట్www.prasthanam.com ను కూడా నిర్వహిస్తున్నది. వివిధ భాషలకు చెందిన ప్రసిద్ధ సాహిత్య వేత్తల ఫొటోలు ఈ వెబ్సైట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన ప్రస్థాణం సంచికలతో పాటు ప్రత్యేక సంచికలు కూడా ఆర్కివ్స్గా వెబ్సైట్లో నిర్వహిస్తున్నది. సాహిత్యాభిమానులకు కనుల విందుగా ప్రస్థానం వెబ్సైట్లో వెలకట్టలేని సాహిత్య సంపదను అందుబాటులో ఉంచడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాభిమానులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్థానం వెబ్సైట్www.prasthanam.com ను సందర్శించండి! విస్తారమైన సాహిత్య సంపదను అందుకోండి! మీ మిత్రులందరికీ తెలియజేయండి! తెలుగు భాషాభివృద్ధి కృషిలో మీరూ భాగస్వాముల కండి!
శుభాకాంక్షలతో….
– వొరప్రసాద్
Leave a Reply