జనవరి 14, 2014

బహారో ఫూల్ బర్‍సావో

Posted in హిందీ పాటల అర్థం at 10:10 సా. by వసుంధర

1966లో వచ్చిన సూరజ్ చిత్రానికి సంగీత దర్శకులు శంకర్ జైకిషన్. ఆ చిత్రంలో శారద అనే గాయకురాలిని పరిచయం చేశారు. ఆమె పాడిన రెండు పాటలూ (దేఖో మేరా దిల్ మచల్ గయా, తిత్‍లీ ఉడీ) అప్పట్లో చాలా పెద్ద హిట్. ఐతే ఆ చిత్రంలో మహమ్మద్ రఫీ పాడిన బహారోఁ ఫూల్ బర్‍సావో పాట తీయగా, హాయిగా ఉండి ఎన్నిసార్లు విన్నా తనివి తీరేది కాదు. అప్పట్లో రేడియోమీదనే ఆధారం. ఈ పాటకోసం ముఖ్యంగా రేడియో సిలోన్‍లో అమీర్ సయానీ  బినాకా గీత్ మాలా కార్యక్రమం వినేవాళ్లం. ఆ కార్యక్రమంలో వారంవారం హిందీ సినిమా పాటలకు రాంకులిచ్చేవారు. ఈ పాట చాలావారాలు మొదటి ర్యాంకులో ఉండడమే కాక- ఆ ఏటికి నంబర్ వన్ పాటగా వచ్చినట్లు బాగా గుర్తు. అంతగా జనాదరణ పొందిన ఆ పాట అర్థం కూడా ఎంత గొప్పగా ఉందో- జనవరి 13 ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం చెబుతుంది.

hindi song baharo phool barsaavo

Leave a Reply

%d bloggers like this: