జనవరి 14, 2014

యాబై ఏళ్ల గుడిగంటలు

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:33 సా. by వసుంధర

యాబై ఏళ్ల క్రితం చూశాను గుడిగంటలు చిత్రాన్ని. రక్తసంబంధం చిత్రంనుంచి తమిళ చిత్రాల అరవ పోకడలను తన నటనలో జొప్పించిన ఎన్టీఆర్ నటన- చరణదాసి, మిస్సమ్మ చిత్రాల నటనను అభిమానించేవారిని నిరుత్సాహపర్చింది. సినీ అనుమానాలపై చతురోక్తులల్లి హాస్యపు జల్లులు కురిపించిన ముళ్లపూడి వెంకటరమణ- అలాంటి అనుమానాల కథకు మాటలివ్వాల్సి రావడం అదోలా అనిపించింది. అసమాన ప్రతిభాశాలి, అనుభవశాలి ఘంటసాల- అప్పుడే సినీరంగంలో ప్రవేశించిన సంగీత దర్శకుల జంట లక్ష్మీకాంత్ ప్యారేలాల్  తొలి చిత్రపు (పారస్ మణి) పాటని అనుకరించాల్సి (నీలికన్నుల నీడలలోనా) రావడం బాధని కలిగించింది. హీరోకి ఘంటసాల గొంతు తప్పనిసరి కాబట్టి- కంచుకంఠం జగ్గయ్య పాటని పిబి శ్రీనివాస్ (నీలికన్నుల నీడలలోనా) గొంతులో వినిపించడం అసమంజసంగా అనిపించింది. ఇప్పుడు ఈ చిత్రం గొప్పతనం పాతది కావడమే. ఈ చిత్రం గురించిన కొన్ని ఆసక్తికర అంశాల్ని నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. ఈ క్రింద ఇస్తున్నాం. 

movie gudigantalu

Leave a Reply

%d bloggers like this: