ఫిబ్రవరి 6, 2014

సినిమాగా సినిమా

Posted in వెండి తెర ముచ్చట్లు at 1:47 సా. by వసుంధర

మీరు

భారతదేశంలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు వెళ్లి అక్కడి చిత్రాలు చూడలేదా?

సినిమాకి సంబంధించిన వివిధ అంశాల గురించిన పుస్తకాలు చదవలేదా?

సినిమాలకు సంబంధించి వివిధ భాగాల గురించిన విశేషాలు తెలుసుకోలేదా?

సినిమాను ప్రేమించే వ్యక్తులుగా ‘అయ్యో, ఇంకా కొంత తెలిస్తే’ బాగుండునే అనుకుంటున్నారా?

మీ అందరి కోరికలూ తీరుస్తూ-

పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, సెన్సారు బోర్డు సభ్యుడిగా, సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తిగా- నందగోపాల్- తాను తెలుసుకున్న విషయాలన్నిటినీ- మనకోసం వివరంగా గ్రంథస్థం చేసి మనకు అందించిన విలువ కట్టలేని అపురూప గ్రంథం- ‘సినిమాగా సినిమా’.

సినీరంగానికి సంబంధించిన ప్రతివ్యక్తీ, సినిమాను ప్రేమించే ప్రతిమనిషీ, మిస్ కాకుండా చదవాల్సిన గొప్ప పుస్తకం ‘సినిమాగా సినిమా’.

నా మాటలు విని ఈ పుస్తకం కొని చదివినవారెవరూ నన్ను కోప్పడరు నాకు తెలుసు. పైగా నాకు కృతజ్ఞతలు చెబుతారు. అది ఖాయం.

ఇంత గొప్ప ‘సినిమాగా సినిమా’ పుస్తకాన్ని మనందరికీ అందించిన నందగోపాల్ ధన్యజీవి.

-వేమూరి సత్యనారాయణ (పాత్రికేయులు, సినీ ప్రముఖులు). 

ఈ పుస్తకానికి ప్రముఖ చిత్రకారుడు జయదేవ్ ముందుమాటకై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Cinema ga Cinema' front cover  printer details index 1

Leave a Reply

%d bloggers like this: