ఫిబ్రవరి 18, 2014
అందరు అందరే అందరందరే
నానృషిః కురుతే కావ్యం అన్నారు పెద్దలు. అలనాడు శ్రీనాథుడు ఈ క్రింది పద్యాన్ని ఎవర్ని ఉద్దేశించి చెప్పాడో కానీ అది నేటి కాలమాన పరిస్థితులకు ఇంత చక్కగా ఎవరికి వర్తిస్తుందో ప్రత్రిఒక్కరికీ చెప్పకనే తెలుస్తుంది. సమయానుగుణంగా ఈ పద్యాన్ని పంపిన మోచర్ల శ్రీహరికృష్ణ గారికి ధన్యవాదాలు.
శ్రీనాధుని కవితా చమత్కారములు – ( పౌనరుక్త్య చమక్రుతి)
“కొందరు ప్రాక్కిటీస్వరులు, కొందరు కాలుని ఎక్కిరింతలున్
కొందరు భైరవాశ్వములు, కొందరు పార్ధుని తేరి టెక్కెముల్
కొందరు కృష్ణ జన్మమున గూసిన వారలు నందరందరే
యందరు నందరే మరియు నందరు నందరే యందరందరే”
ప్రాక్కిటీస్వరులు = పందులు
కాలుని ఎక్కిరింతలు = దున్నపోతులు
భైరవాశ్వములు = కుక్కలు
పార్ధుని తేరి టెక్కెముల్ = కోతులు
కృష్ణ జన్మమున గూసిన వారలు = గాడిదలు
Rayaprolu Sudhakar said,
డిసెంబర్ 11, 2019 at 11:23 ఉద.
Thanks for posting our literature
Mocherla Sri Hari Krishna said,
ఫిబ్రవరి 23, 2014 at 7:58 సా.
ప్రాక్కి టీస్వరులు = ఆది వరాహ స్వాములు – పందులు
భైరవాశ్వములు = భైరవుని వాహనములు – కుక్కలు
కాలుని ఎక్కిరింతలు = యముని వాహనములు – దున్నపోతులు
పార్ధుని తేరి టెక్కెముల్ = అర్జున రధ ధ్వజములు – కోతులు (జెండా ఫై కపి రాజు)