ఫిబ్రవరి 18, 2014
భువనచంద్ర ‘వాళ్లు’ గురించి
సినీ గేయ ప్రముఖులు శ్రీ భువనచంద్ర స్వప్న మాసపత్రికలో ‘వాళ్లు’ అనే ధారావాహిక వ్రాస్తున్నారు. దానిపై ప్రముఖ రచయిత్రి మంథా భానుమతి స్పందన ఈ క్రింద ఇస్తున్నాం. అంతర్జాలంలో లంకెకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
భువనచంద్రగారు ” వాళ్లు” అని ఒక అనూహ్య ధారావాహిక స్వప్న మాసపత్రికలో రాస్తున్నారు. నేను ఈనెల నుంచే చదువుతున్నాను. ఇది పదవ భాగం.
ఇంతవరకూ వచ్చిన పత్రికలు ఊర్లో సరిగ్గా ఉండక కొన్ని, ఉన్నా పత్రిక దొరక్క కొన్ని చదవ లేకపోయాను. నిజంగా అనూహ్యమైనదే. ఒక వివేకానంద, ఒక జిడ్డు కృష్ణమూర్తి.. ఇంకా ఎందరో మహానుభావులు నుడివిన వేదాంత సూక్తులను అలవోకగా తెలియజేస్తుందీ నవల. భువనచంద్రగారూ! అంత తొందరగా చదవగలిగినది కాదండీ మీ రచన. నెమ్మది నెమ్మదిగా చదువుతూ.. అందులోని విషయాలను గ్రాహ్యం చేసుకుంటూ సాగాలి.
కొన్ని కొన్ని అమూల్యమైన వాక్యాలున్నాయి.
“ఒకరికి పెట్టాక తినడంలో ఉండే తృప్తి చెప్పనలవి కాదు.”
“శరీరం అనేది ఒక వెహికిల్.. దాని డ్రైవర్ భగవంతుడు.”
“విషంకంటే సక్తివంతమైనది మాట. అలాగే అమృతంకన్నా తియ్యనైనదీ మాటే..”
అలా రాస్తూ పోతుంటే ఎన్నైనా వస్తాయి.
ఒక అలౌకికానందం కలిగింది ఈ ఒక్క భాగం చదువుతుంటేనే..
మిగిలిన భాగాల సంగతేమిటి?
రాజుగారూ కొంచం ముందటి భాగాలు పంపుతారా.. ఫైల్ ఉంటే. పాత పత్రికలు దొరకడం లేదు.
అందరూ తప్పక చదవాలని నా కోరిక.- మంథా భానుమతి
Leave a Reply