ఫిబ్రవరి 23, 2014

అలనాటి నటుడు ఆర్. నాగేశ్వరరావు

Posted in వెండి తెర ముచ్చట్లు at 8:05 సా. by వసుంధర

పిన్న వయసులోనే గతించిన అసాధారణ నటుడు ఆర్. నాగేశ్వరరావు. ఏయన్నార్ స్వంతచిత్రం దొంగరాముడు లో విలన్ బాబుల్‍గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆ చిత్రదర్శకుడు కెవి రెడ్డి- ఆర్ నాగేశ్వరరావులా సహజంగా అలవోకగా సంభాషణలు చెప్పాలనీ, హావభావాలు పలికించాలనీ- నాగేశ్వరరావుని మందలించినట్లు- స్వయంగా నాగెశ్వరరావే చెప్పుకున్నారు. విలన్‍లా ఎంత భయపెట్టేవాడో, మంచివాడుగా అంతగానూ రాణించిన (పెళ్లినాటి ప్రమాణాలు) ఈ  మఃహానటుణ్ణి హిందీ చిత్రపరిశ్రమకు పరిచయం చెయ్యాలని ప్రముఖ దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ సంకల్పించినప్పుడు- అప్పటి అగ్ర ప్రతినాయకుడు ప్రాణ్ అంతటి నటుడి గుండెలు దిగ్గురన్నాయని చెప్పుకుంటారు. అది జరిగేలోగానే ఆర్. నాగేశ్వరరావు ఆయువు తీరిపోవడం మన వెండితెర దురదృష్టం. ఈ వెండితెర బంగారం చిరు పరిచయాన్ని నేడు అందించిన ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికకు అభినందనలు.

rnr venditer abngaram

Leave a Reply

%d bloggers like this: