ఫిబ్రవరి 24, 2014

ఛోడో కల్‍కీ బాతే- ఒక మంచి హిందీ పాట

Posted in హిందీ పాటల అర్థం at 6:36 సా. by వసుంధర

ఉషాఖన్నామన దేశ సినీరంగంలో తొలి మహిళా సంగీతదర్శకురాలు. ఆమె తన 18వ ఏట తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన దిల్ దేకే దేఖో చిత్రంలో పాటలు 1959లో గొప్ప ఊపుతో దేశంలో సంచలనం కలిగించాయి. వాటిలో  మెరీజా వాహ్ అనే పాట- అదే చిత్రంలో హీరోయిన్‍గా తెరంగేట్రం  చేసిన ఆశాపరేఖ్‍ని కొన్ని దశాబ్దాలపాటు వెండితెరపై చమక్కుమనేలా చేసింది. ఆ చిత్రంలో టైటిల్ సాంగ్‍ని తెలుగు నాట ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాల శాంతినివాసం చిత్రంలో హాస్యజంటకోసం వాడారు.

ఉషాఖన్నా రెండవచిత్రం హమ్ హిందూస్థానీ. అందులో పాటలకు తొలిచిత్రపు ఊపుతో పాటు లలిత సంగీతపు మార్దవం అద్ది- ఆమె తన బహుముఖప్రజ్ఞను నిరూపించుకున్నారు. ఆ చిత్రంలో ఛోడో కల్‍కీ బాతే అన్న పాటని ప్రస్తుత సందర్భానుసారంగా  ఆంధ్రజ్యోతి దినపత్రికలో తెలుగులో టీకాతాత్పర్య సహితంగా  వివరించారు. చదవండి….

hindi song hum hindusthani

2 వ్యాఖ్యలు »

  1. subbalakshmi said,

    chodo kal ki baaten paata ninchi entho entho nerchukovaalsinadi vundi. mii vivarana valla kavigaari goppadanam paamarulanikuudaa ,vippicheppi,manasuni ranjinpa jesindi annadi nirvivaadaamsamu –dhanyavaadaalu—lakshmi

  2. subbalakshmi said,

    chaalaa adbhuta vennutattu idi ani ippatiki ardham ayyindi. ippatimana AP ki chaalaa mukhyamainadani anipistondi . vivarana adbhutangaa vundi –dhanyavaadaalu– lakshmi


Leave a Reply

%d bloggers like this: