మార్చి 6, 2014
అనిల్ అవార్డ్స్ కథల పోటీ- స్వాతి
ఈ సమాచారం అందజేసిన శ్రీమతి నండూరి సుందరీ నాగమణికి ధన్యవాదాలు.
స్వాతి మాసపత్రిక వారు ‘అనిల్ అవార్డ్ కథల పోటీ’ ప్రకటించారు. అనిల్ అవార్డ్ కు ఎంపిక అయిన కథ కు రూ.25000/- బహుమతి.
నిబంధనలు:
*కథల ఎంపికలో సంపాదకులదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. పోటీ తేదీని పొడిగించేందుకు లేదా రద్దు చేసేందుకు స్వాతి పబ్లికేషన్స్ యాజమాన్యానికి సర్వ హక్కులూ ఉన్నాయి.
*కథ అరటావు సైజు లో 10 పేజీలకు మించరాదు. కాగితానికి ఒక వైపున మాత్రమే వ్రాయాలి.
*అనువాదాలు, అనుకరణలు ఇతర పత్రికలకు పంపబడి పరిశీలనలో ఉన్న కథలను పంపవద్దు.
*బహుమతిని పొందని కథల్లో యోగ్యమైన వాటిని మామూలు ప్రచురణకు తీసుకునే హక్కు స్వాతి వారికి ఉంది.
*మామూలు ప్రచురణకు తీసుకున్న కథలను స్వాతి మాసపత్రికలో లేదా సపరివార పత్రికలో ప్రచురిస్తారు.
*ప్రచురణకు స్వీకరించబడని రచనలు తిప్పి పంపగోరు వారు తగినన్ని స్టాంపులు అతికించి, తమ చిరునామా వ్రాసిన కవరును జతపరచాలి.
*కథను పంపించేటప్పుడు కవరు మీద ‘అనిల్ అవార్డ్ కథల పోటీకి’ అని వ్రాయాలి.
కథలు పంపించవలసిన చిరునామా:
ఎడిటర్, స్వాతి సచిత్ర మాసపత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావు పేట,
పోస్ట్ బాక్స్ నం.339, విజయవాడ – 520 002.
కథలు చేరవలసిన ఆఖరు తేదీ: 30 ఏప్రిల్, 2014.
Leave a Reply