మార్చి 15, 2014

జనసేన పవనం

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:19 సా. by వసుంధర

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరు ఎందరినో ఆవేదనకు గురి చేసింది. ఇది అవకాశంగా తీసుకుని కొత్త పార్టీలు తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి. వాటిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన జై సమైక్యాంధ్ర పార్టీ- తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రస్తావించింది. మేము మీతో కలిసి ఉండమని తెగేసి చెప్పినవారిని సమైక్యంగా ఉండాలని పదేపదే దేబిరించడంలో ఆత్మగౌరవం ఏమున్నదో అర్థం చేసుకోవడం కష్టం. ఏ తీరున జరిగినా ఇప్పుడు రాష్ట్రం రెండు మౌక్కలైన మాట నిజం. పేర్లు వేరైనా మనమంతా తెలుగువారమన్న భావనను పెంపొందించుకుని రెండు రాష్ట్రాల ప్రగతికీ కృషి చెయ్యడం మన బాధ్యత. ఈ నేపథ్యంలో నిన్నటి దినాన పవన్ కల్యాణ్ ప్రకటించిన జనసేన పార్టీ చర్చనీయాంశమైంది. పవన్ పదవిని కోరలేదు. విభజనను నిరసించలేదు. అందరిపట్లా సుహృద్భావాన్ని ప్రదర్శించాడు. ఆయితే ప్రముఖ రాజకీయవేత్తల మాటలను, చేతలను పార్టీలకు అతీతంగా నిర్భయంగా ప్రకటించాడు. సగటు పౌరులను పీడిస్తున్న సందేహాలను వేదికపై వెలిబుచ్చారు. రాజకీయంగా అతడి సంసిద్ధత తెలియలేదు కానీ- దేశ పరిస్థితులపట్ల ఆవేదన స్పష్టమయింది. ఒక ప్రాంతం కోసమో, ఒక రాష్ట్రంకోసమో కాక- దేశంకోసం ప్రాణత్యాగం చేసే సంస్కృతి నేడు మనకి దూరమైందనీ, తానందుకు పాటు పడతాననీ నొక్కి చెప్పాడు. ఇంతవరకూ ఏ నాయకుడూ చూపని నిజాయితీ అతడి మాటల్లో కనిపించింది. పవన్ సభా విశేషాలపై నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక  కథనానికి లంకెలు ఇక్కడ ఇస్తున్నాంః కాంగ్రెస్ హటావో   ప్రతిపాదన    విభజనపై

పవన్‍కి జెండా ఉన్నది కానీ అజెండా లేదని చాలామంది నిరాశ చెందారు. కానీ ఈ సభ కొత్త పార్టీకి పునాదిరాయి మాత్రమేననీ పవన్‍లో ఒక ఆవేశపరుడు, నిజాయితీపరుడు అయిన ప్రముఖ సినీనటుడు విభిన్న తరహాలో రాజకీయ ప్రవేశం చేసినట్లు తోస్తుంది. దీని ప్రభావం మున్ముందు పుంజుకుంకునే అవకాశముంది. ప్రస్తుతానికి అతడు సమర్థుడైన నాయకునికి మద్దతునిచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే సినీ నటుడు కావడంవల్ల పవన్ తీసుకోవాల్సిన కొన్ని జగ్రత్తలున్నాయి. అతడి అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. తెలుగునాట సినీ అభిమానులు దురభిమానానికి ప్రసిద్ధి. అతడు చూపిన సహనం, వివేకం, సంయమనం అభిమానులలో కొరవడితే-  జనసేన భవిష్యత్తు- ఖుషీ తర్వాత జానీ, గుడుంబా శంకర్ చిత్రాల బాటను పట్టవచ్చు. నిన్నటి సభపై నేటి సాక్షి దినపత్రికలో వచ్చిన కార్టూన్ క్రింద ఇస్తున్నాం.

cartoon sakshi

జనసేన ఆడియో ఫంక్షన్ అదిరింది..

 

 

Leave a Reply

%d bloggers like this: