మార్చి 15, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:31 సా. by వసుంధర

కాంగ్రెస్‍కి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి, ఆ పార్టీపై ఎన్నికల్లో పోరాడి కొన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను సాధించి, తన పార్టీని కాంగ్రెస్‍లో విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని మంత్రిపుంగవుడైన (ఇంద్రసేనారెడ్డి) ప్రముఖ తెలుగు సినీనటుడు చిరంజీవి. ఆయన సమైక్యాంధ్రవాదినని ప్రకటించుకుని – ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆవేదనతో సరిపెట్టుకుని మంత్రిపదవిలో కొనసాగుతూ సోనియాగాంధీకి నమ్మకస్థుడుగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలెన్ని వచ్చినా జాతీయ పార్టీ అంటే కాంగ్రెసేనని స్వానుభవంతో చెబుతున్న ఆయన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికై రాష్ట్రంలో కృషి చెయ్యనున్నారు. ఈ ఎన్నికల్లో కాంఫ్రెస్ పరిస్థితిపై నేటి ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ కార్టూన్ చూడండి.

cartoon eenadu

దాక్కో దాక్కో పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయమని అడిగితే చస్తాం! 

Leave a Reply

%d bloggers like this: