మార్చి 27, 2014

పవన్ ‘ఇజం’

Posted in సాంఘికం-రాజకీయాలు at 5:36 సా. by వసుంధర

పవన్ వ్రాసిన ‘ఇజం’ పుస్తకం ఈ రోజు విడుదల కానున్నది. ఈ పుస్తకం గురించి నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కొన్ని వివరాలుః

pavan's book

1 వ్యాఖ్య »

  1. చక్కటి భావజాలం. బీజం మంచిదే. క్షేత్రశుద్ధి నేటి ఆవశ్యకత. క్షేత్రశుద్ధి మనిషి ఆత్మశుద్ధితోనే సాధ్యం. బావుందని చప్పట్లు కొట్టి సరిపెట్టుకోక విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సమయమిది, మార్పు నేటి అవసరము. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశములో సుపరిపాలన, స్వపరిపాలన ఆలంబనముగా సమర్ధ నాయకునికి అధికారము ఇవ్వవటము ఆవశ్యకము. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్మజూపే బేరగాళ్ళను, స్వార్ధము కోసము ఆత్మహననానికి పాల్పడే దళారులను, చీడపురుగులను ఏరివేసి ఫలసాయమును కాపాడుకొన్నట్లు స్వరాజ్యమును విదేశీ శక్తుల నుండి, వాటి పాలెగాళ్ళనుండి కాపాడి మరమనుషులనుకాక, స్వతంత్రముగ ఆలోచించి స్వదేశాభిమానముతో పాలించగల వ్యక్తులకు అధికారము కట్టబెట్టవలసిన కర్తవ్యము ప్రతిఒక్క వ్యక్తిపైన ఉన్నది. మంచిని ఎంచుకోవటం మనకొరకే అన్నది మనుషులమనుకొనేవారికి కలుగవలసిన వయక్తికమైన ఆలోచన. ఈ ఆలోచనాధోరణి ‘ ఇజం ‘ అన్న పుస్తకములోనూ, శ్రీ పవన్ కల్యాణ్ పుస్తకములోనూ వ్యక్తమౌతున్నట్లు ఈ పుస్తకమూగూర్చి ప్రచురింపబడిన వ్యాసములో వ్యక్తమౌతున్నది. ఇన్ని ఆర్ధిక, అంగబల, రాజకీయ పలుకుబడి గల శక్తులమధ్యకు వచ్చి నిర్భయముగా తన అభిప్రాయములను వెల్లడించిన పవన్ కల్యాణ్ గారు అభినందనీయులు. ఈతరానికి ప్రతినిధిగా సారూప్య భావజాలముకలిగిన వ్యక్తుల వలన భారతీయ సమాజము పరిపుష్టమౌతుందన్న ఆశ అంకురిస్తోంది. మంచి మనసుల ప్రోత్సాహం ఈ శక్తికి పరిపుష్టత కలిగించటం దేశభక్తుల కర్తవ్యం. భారత మాతకు జయోస్తు.


Leave a Reply

%d bloggers like this: