మార్చి 30, 2014

నేటి కార్టూన్

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:52 సా. by వసుంధర

బొమ్మల్లోనే పదాల శ్లేషతోనూ వ్యంగ్యాస్త్రాలు సంధించగల సత్తా మన కార్టూనిస్టులది. అందుకు నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన కార్టూన్. ఒక మినీ కథని చిన్న బొమ్మ, వ్యాఖ్యలో ఇరికించే నేర్పుకి మచ్చు నేటి Deccan Chronicle దినపత్రికలో వచ్చిన కార్టూన్. రెండు కార్టూన్లూ కడుపుబ్బ నవ్వించినా, అవి సమకాలీన రాజకీయ పరిస్థితికి అద్దం పట్టడం, ఆ పరిస్థితిని అనుభవిస్తున్నది మనం కావడం- కారణంగా ఏడవలేకనే నవ్వాలి. నవ్వడానికి కాక ఆలోచించడానికి ఈ కార్టూన్లు ప్రోత్సహిస్తాయనుకుందామంటే- ఏమి సేతుర లింగా అన్న పాట గుర్తుకొస్తుంది. ఎందుకంటే మన జనం ప్రవచనాలు వినడానికి క్యూలు కడుతున్నారు. దైవదర్శనానికి నడిచి ఏడు కొండలెక్కుతున్నారు. మనమెప్పుడో మారిపోవాలి కదూ!

cartoon ajcartoon dc

Leave a Reply

%d bloggers like this: