ఏప్రిల్ 4, 2014
నేటి కార్టూన్
1983కి ముందు జరిగిన ఓ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచిలో (ఇంగ్లండులో జరిగింది- 60 ఓవర్లు) మన సునీల్ గవాస్కర్ ఓపెనర్‌గా వచ్చి చివరిదాకా నాటవుట్‌గా ఉండి 36 పరుగులు చెయ్యడం అప్పట్లో అంతా నవ్వుకున్న విశేషం. త్వరగా పరుగులు చెయ్యడంకంటే- వికెట్ కాపాడుకోవడం ముఖ్యం అనుకునే ప్రాథమిక దశ అది. అదే గవాస్కర్ 1987లో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచిలో 88 బంతుల్లో 103 పరుగులు చేసే మనఃస్థితికి రాగలిగాదు. కానీ మన రాజకీయవాదులు ఎన్నికలు మీదకు వచ్చేక కూడా ఇంకా పొత్తుల విషయంలో ఎంత నెమ్మదిగా వ్యవహరిస్తారో నేటి ఈనాడు దినపత్రికలోని కార్టూన్ చెబుతుంది. ఇక సీట్ల వ్యవహారం పూర్తి కుటుంబవ్యవహారంగా మారిపోయిందని ఏడవలేక నవ్విస్తుంది నేటి Deccan Chronicle దినపత్రికలోని కార్టూన్.
ఇంత సుదీర్ఘంగా పొత్తు చర్చలు జరపాల్సింది కాదు. ఇప్పుడెట్లా, గడ్డాలు పెరిగిపోయి చిక్కు పడింది చూడు…
Leave a Reply