ఏప్రిల్ 11, 2014

ఒక నారి వంద తుపాకులు

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:59 సా. by వసుంధర

1960-70లలో చాలా  తెలుగు సినిమాల్లో క్లబ్ పాటలు, శృంగార భంగిమ తప్పనిసరి. వాటిని ఎక్కువగా ఎల్.ఆర్. ఈశ్వరి పాడేవారు.  ఇప్పటి ఐటమ్ సాంగ్సుకిలా  కాక అప్పట్లో వీటికి ప్రత్యేకంగా నాట్యతారలు ఉండేవారు. వారిలో జ్యొతిలక్ష్మికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. హిందీలో హెలెన్‍కిలా ఆమెకు చక్కని అంగసౌష్టవం, నాట్యప్రతిభ ఉండేవి. ఆ సమయంలో జానపద చిత్రలద్వారా వాంప్‍గా ప్రవేశించిన విజయలలిత అనే తార కూడా-  క్లబ్ డ్యాన్సులు, శృంగార భంగిమ పాటల్లో తనదంటూ ఒక శైలి ప్రవేశపెట్టింది. వాటిలో నృత్యం కంటే- అసభ్యతకు  ప్రాధాన్యం ఎక్కువని మాకు అనిపించేది. క్రమంగా ఆమె సినీరంగంలో నిలద్రొక్కుకుంది. ఎంతలా అంటే ఒక నిర్మాత- కెయస్‍ఆర్ దాస్ దర్శకత్వంలో – విజయలలిత కథానాయికగా రౌడీరాణి అనే చిత్రాన్ని నిర్మించగా అది ఘనవిజయం సాధించింది. ఆ వెంటనే వచ్చిన రివాల్వర్ రాణి చిత్రం కూడా ఘనవిజయం సాధించడంతో- కొంతకాలంపాటు ఆ తరహా చిత్రాల హవా నడిచింది. విజయలలిత కొంతకాలంపాటు బాక్సాఫీస్ రాణిగా stuntsలో తిరుగులేని నటిగా వెలిగింది. ఆమె అక్క కూతురు విజయశాంతి ఆమెను ప్రేరణగా తీసుకుని stuntsలో లేడీ అమితాబ్‍గా పేరుకెక్కింది. ఐతే ఆమె నటించినవి మాత్రం stunt సినిమాలు కావు. విప్లవాత్మక చిత్రాలు. 

విజయలలిత కథానాయికగా వచ్చిన ఒక నారి వంద తుపాకులు అనే చిత్రం గురించిన ఆసక్తికరమైన వ్యాసం ఏప్రిల్ 9 ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూశాం.  ఆ చిత్రం చూడ్డానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. వ్యాసం క్రింద ఇస్తున్నాం.

oka nari vanda tupakulu

Leave a Reply

%d bloggers like this: