ఏప్రిల్ 11, 2014
వహీదా ముచ్చట్లు
1955లో విడుదలైన రోజులు మారాయి చిత్రాన్ని నాకు 11 ఏళ్ల వయసప్పుడు రాజమండ్రి శ్యామల టాకీసులో చూశాను. అప్పటికది 19వ వారంలో నడుస్తోంది. నాకు గుర్తున్నంతవరకూ- రాజమండ్రిలో 23 వారాలు నడిచినట్లు గుర్తు. ఆ చిత్రంలో ఏరువాకా సాగారో అన్న పాట అప్పట్లో ఆబాలగోపాలాన్నీ ఆకర్శించి అలరించి గొప్ప సంచలనం సృష్టించింది. ఆ పాటకు నాట్యతారగా ఎన్నుకోబడ్డ వహీదా రహమాన్కి అది తొలిచిత్రం. చిత్రంలో సుమారు 3 నిముషాలే కనిపించినా తెలుగునాట ఆమె పేరు మార్మ్రోగిపోయింది. రోజులు మారాయి పేరు చెప్పగానే నాఅగేశ్వరరావుకంటే ముందు స్మరించే పేరు వహీదాదే అయింది. ఆ చిత్రం వంద రోజులు దాటేక- ఏరువాకా సాగారో పాట ఒక్కటీ రంగుల్లో చూపించడం మొదలెట్టారు కూడా. అలా నేనా పాటని రంగుల్లోనే చూశాను. ఆ సంవత్సరమే కొద్ది నెలల తర్వాత విడుదలైన జయసింహ చిత్రంలో ఆమె కథానాయికగా వేసింది. తెలుగులో అదామె 2వ చిత్రం. ఆ చిత్రంలో 2వ కథానాయిక అంజలి కావడం, ఆమెకే ఎక్కువ గుర్తింపు రావడం గమనార్హం. ఆతర్వాత ఆమెని ప్రముఖ హిందీ నట దర్శకుడు గురుదత్ 1957లో ప్యాసా చిత్రం ద్వారా హిందీ చిత్రరంగంలో ప్రవేశపెట్టాడు. అప్పట్నించీ ఆమె జాతీయస్థాయిలో ప్రముఖ హిందీ సినీతారగా ఒక వెలుగు వెలిగింది. గైడ్ చిత్రం ఆమెకు నటిగా ఉన్నత స్థానాన్నిచ్చింది. 1974లో యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా వచ్చిన బంగారు కలలు చిత్రం తెలుగులో ఆమెకు 3వది. 2006లో వచ్చిన చుక్కల్లో చంద్రుడు ఆఖరుది. ఈ రెండు చిత్రాలూ విజయం సాధించకపోతే అది వేరే సంగతి.
నస్రీన్ మున్నీ కబీర్ ఆమె గురించి- coversations vit waheeda Rehman అనే పుస్తకం వ్రాసారు. ఆ ముచ్చట్లను ఆంధ్రజ్యోతి దినపత్రికలో (ఏప్రిల్ 3) ఓపెన్ డయాస్ వేదికపై వినిపించారు. అవి ఇవిః
Leave a Reply