ఏప్రిల్ 12, 2014

పెద్దన బోలు పండితులు

Posted in భాషానందం at 6:52 సా. by వసుంధర

శ్రీ కృష్ణ దేవ రాయలు ఒక నాడు సభకు ఒక బంగరు  పళ్ళెములో గండ పెండేరము నుంచి, 

సంస్కృతం మరియు ఆంధ్రము లో సమానముగా కవిత్వము ఎవరు  చెప్ప గలరో వారికి ఈ గండ పెండేరము 
ఈయబడునని ప్రకటించెను.  ఆ బహుమతి అందుకొనుటకు  ఒక్క కవి కూడా ముందుకు రాలేదట. 
 
అప్పుడు రాయల వారు ఆశువుగా ఒక పద్యం ఎత్తుకొనిరట: 
 
‘ముద్దుగ గండ పెండియరమున్  గొనుడంచు బహూకరింప గా 
 నొద్దిక నా కొసంగుమని యొక్కరు గోరగ రారు లేరొకో!’
 
సభ లో కవులందరూ ఉలకక, పలకక కూర్చున్నారట. శ్రీ రాయల వారు పెద్దన వైపు  చూచినారట. 
 
వెంటనే పెద్దన గారు నిలబడి, రాయల వారి పద్యానికి మిగిలిన రెండు పాదములు ఈ  విధంగా  పూరించి 
సభాసదులను, రాయల వారినీ మెప్పించి బహుమతి ని పొంది నారట.  
 
‘ పెద్దన బోలు పండితులు పృథ్వి ని లేరని నీ వెరుం గవే 
 పెద్దన కీ దలంచినను బేరిమి నాకిడు  కృష్ణరా ణ్ణృపా’. 
 
ఈ  పద్యమునకు  రెండర్ధములు చెప్పవచ్చును – పెద్దనతో  సరితూగు కవులు పండితులు, ఈ విశాల 
ప్రపంచమున లేరు అని మొదటి అర్ధము. 
పెద్ద అనన్ పోలు పండితులు లేరు పేరిమితో (గౌరవముతో) ఈ దలంచినను నాకిమ్ము  – అని 
రెండవ అర్ధము. 
ఈ పద్యము చెప్పిన వాడు పెద్దన  కాని పద్యమున పెద్దన పేరు కాన రాదు కనబడుతోంది అనుకుంటే 
అది ముద్రాలంకారము
                                                                                                                 –   మోచర్ల హరికృష్ణ

Leave a Reply

%d bloggers like this: