ఏప్రిల్ 14, 2014

ఒకటికి నాలుగు- 1

Posted in ఒకటికి నాలుగు at 11:17 ఉద. by వసుంధర

ఎదుటివారికి ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయట. ఈ శీర్షికలో మన ప్రముఖుల విషయంలో ఆ ఒకటికి నాలుగు తెలుసుకుందాం. ఈ శీర్షికలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈసారికి ఒకటికి నాలుగు స్పందనలు ఇచ్చినా- ప్రతిసారీ అలా చెయ్యనవసరం లేదు. ఒకోసారి ఒక్క స్పందనే నాలుగింటి పెట్టు కావచ్చు. దీనికి సంఖ్యపరంగా పరిమితి లేదు. పత్రికల్లో ప్రముఖుల మాటలు విన్నప్పుడు కలిగిన ఆవేశానికి అసహాయతతో ఊరుకునేబదులు- ఇలా బయటపెట్టి కొంత ఊరట చెందాలనుకునేవారికి ఇదో వేదిక. 

ఒకటిః విశాఖపట్నం, ఏప్రిల్ 13: దళిత, గిరిజన బస్సు యాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఆదివారం నిర్వహించిన సభలో మాట్లాడుతూ- దరిద్రులు, దొంగలు మాత్రమే కాంగ్రెస్ పార్టీని విడిచివెళ్లారని, వారిని చేర్చుకున్న పార్టీలకు నీతి నిజాయితీ లేవని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు….

నాలుగుః అంటే కాంగ్రెస్ పార్టీలో దరిద్రులు, దొంగలు ఉన్నారు. వారిని కాంగ్రెస్ పార్టీ వెళ్లగొట్టలేదు, వారే వీడి వెళ్లిపోయారు. వారున్నంత కాలం కాంగ్రెస్ పార్టీకి నీతి, నిజాయితీ లేవు. అందుకే పార్టీని వీడని దరిద్రులు, దొంగల గురించి మాట్లాడదు. 

3 వ్యాఖ్యలు »

  1. ఆదినారాయణ రావు said,

    ఇప్పుడే చిరంజీవి “మోడీకి అవకాశం ఇస్తే దేశాన్ని మొత్తం ఒక్కడే కబ్జా చేస్తాడు” అని అనడం విన్నాను. ఆయన ఉద్దేశం “కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే వాళ్ళందరూ దేశాన్ని పంచుకుంటాం” అనా?

    • మసాలా చిత్రాలలో నృత్యాలు ఫైట్లు తప్ప సంభాషణలకు అలవాటుపడని పార్టీమార్చిన ప్రసాదుకు ఈ సూక్ష్మం తెలియకపోవటంలో ఆశ్చర్యమేమీలేదు.

  2. పోయినావారు పోగా మిగిలిన వారిలో ఆ లక్షణాలు పుష్కలముగా ఉన్నై కదా రఘువీరా! తల్లితండ్రులు పెట్టిన పేరుతోకూడ పిలిపించుకోలే దుస్థితిలో ఉండి, నమ్మినవారిని నట్టేటముంచి గంపగుత్తగా మునిగిన నావలో మిగిలిన వారితో కాంగిరేసు కండువానే కప్పుకొని నిర్లజ్జగా ఉన్నవారి సంగతేమిటి రఘువీరా! బీ ఫారాలు తీసుకోవటనికి అభ్యర్ధులు ముందుకు రాకపోతే బస్సులో ఊరూరు తిరిగి అభిమాన సంఘాల వారిమీద ఆధార పడ్డావన్న వార్తలు వచ్చాయిగా! చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు మేకపోతు గాంభీర్యముతో ఇటలీవనిత ప్రాపుకొరకు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం మానేస్తే ఆబోరు దక్కుతుంది. బస్సు యాత్ర తుస్సుమన్న విషయము గుర్తెరిగి ప్రవర్తిస్తే పాలక వర్గములో మీ పార్టీవారు చేసిన అకృత్యములు మీ పాలిట అశనిపాతములై మీకు ఉనికి లేకుండా చేయటములో కొంత ఉపేక్ష వహిస్తైయ్యేమో. నమో నామజపం మీ పాప ప్రక్షాళనకు చెప్పదగ్గ సూచన.


Leave a Reply

%d bloggers like this: