ఏప్రిల్ 20, 2014

నారా చంద్రబాబునాయుడు

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:28 సా. by వసుంధర

మేము 1968-2003 వరకూ ఉద్యోగరీత్యా ఒరిస్సాలో భువనేశ్వర్‍లో ఉన్నాం. తెలుగునాట లేని అనుభూతి ఒక్కసారి కూడా కలుగనివ్వలేదు స్థానికులు. తెలుగునాట రాజకీయాల గురించి కూడా స్థానికులెక్కువ మాట్లాడలేదు.  1995-2004లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాత్రం అక్కడ మా ఒరియా మిత్రులే కాదు,  పరిచితుల్లో- చాకలి, మంగలి వంటి వృత్తిపనులవారు, కూరగాయలు అమ్ముకునేవారితో సహా- అంతా ఏకకంఠంతో- మా రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడివంటి ముఖ్యమంత్రి కావాలని మాతో అనడం చిత్రంగానూ, గర్వంగానూ అనిపించేది. ప్రస్తుతం మోడీ గురించి వివిధ రాష్ట్రాల సామాన్యులు ఏమనుకుంటున్నారో అప్పుడు ప్రపంచమంతా చంద్రబాబు గురించి అలా అనుకునేది. ఆ చమ్ద్రబాబు, మోడీ ఇప్పుడు సంయుక్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఏమౌతుందో చూద్దాం. నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం చంద్రబాబు గురించి రాజకీయాలకు అతీతమైన పరిచయం చేస్తుంది- స్పందించేవారు రాజకీయాలకు అతీతంగా ఉండగలిగితే!

nara chandrababu

Leave a Reply

%d bloggers like this: