ఏప్రిల్ 30, 2014

అలనాటి నటుడు సూరిబాబు

Posted in కళారంగం at 1:22 సా. by వసుంధర

నాటకరంగంనుంచి వచ్చి సినీరంగంలో నటుడిగా, గాయకుడిగా తనదైన ముద్రతో రాణించి ప్రేక్షకులను మైమరపించిన అసాధారణ నటుడు పి. సూరిబాబు. కంచుకంఠానికి మారుపేరుగా ప్రసిద్ధికెక్కిన ఈ మహానటుణ్ణి నేను తొలిసారిగా 1955లో వచ్చిన శ్రీకృష్ణతులాభారం చిత్రంలో (రఘురామయ్య-ఎస్. వరలక్ష్మి) నారదుడి పాత్రలో చూశాను. ఈ చిత్రం 1966లో వచ్చిన (ఎన్టీఆర్, జమున) శ్రీకృష్ణతులాభారం చిత్రంకంటే గొప్పగా ఉన్నట్లు ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. 1955లో సూరిబాబు పాడిన భలే మంచి చౌక బేరము  (ఇచ్చిన వరుసలో 4వది) పాట వరుసను 1966 నాటి చిత్రంలో ఘంటసాల కొద్దిగా ఆధునీకరించి పాడారు. 1960లో వచ్చిన శ్రీవెంకటేశ్వరమాహాత్మ్యం చిత్రంలో ఘంటసాల సంగీత సారథ్యంలో సూరిబాబు పాడిన కళ్లు తెరవరా నరుడా   పాట (ఇచ్చిన వరుసలో 13వది)  అప్పటికి ఘంటసాల ఆధునికతకు అలవాటు పడినవారిని కూడా ఎంతో ఆకర్షించడం విశేషం. శతజయంతి సంవత్సర సందర్భంగా ఆ మహానటుణ్ణి సంస్మరించిన ఈ క్రింది వ్యాసం ఆంధ్రజ్యోతి ఆదివారంలో (ఏప్రిల్ 27) వచ్చింది.

p suribabu april 27 aj

Leave a Reply

%d bloggers like this: