ఏప్రిల్ 30, 2014

ఆర్ ఎం చల్లా అస్తమయం

Posted in సాహితీ సమాచారం at 12:45 సా. by వసుంధర

challa

2 వ్యాఖ్యలు »

 1. టీవీయస్.శాస్త్రి said,

  ఆర్.యమ్.చల్లా అస్తమయం!


  ఆర్.యమ్.చల్లా అని పిలువబడే శ్రీ చల్లా రాధాకృష్ణమూర్తి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమలాపురం అగ్రహారం అనే ఊరు. అక్కడ చల్లా వారందరూ ఉద్దండ పండితులే!వారందరిలో కల్లా ఘటికుడు శ్రీ R.M. చల్లా!ఈయన బహుభాషాకోవిదుడు. సంగీత , నృత్య రంగాలలో కూడా వీరికి మంచి పరిచయం,ప్రవేశం ఉంది. మా చిన్నతనంలో ఇండియన్ ఎక్ష్ ప్రెస్ లో ‘Let us tune to R.M.Challa’ అనే శీర్షిక క్రింద ఆకాశవాణిలో ప్రసారమయ్యే సంగీత కార్యక్రమాల మీద చక్కని సమీక్షలు వ్రాసేవారు . ఆ శీర్షిక,వారి సమీక్షలు సంగీత ప్రియులను బాగా అలరించేవి.వీరికి ఆంగ్ల,సంస్కృత,తెలుగు,ఫ్రెంచ్,హిందీ, ఉర్దూ,ఇటాలియన్,జర్మనీ భాషలే కాక మరికొన్ని భాషలలో కూడా విశేష ప్రావీణ్యం ఉండేది. పండితులే వీరితో మాట్లాడటానికి జంకేవారు. వారితో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది. అది నా భాగ్యం. 1994 లో నేను ఆంధ్రా బ్యాంకు ,భీమలాపురం శాఖకు మేనేజర్ గా పనిచేస్తున్న రోజుల్లో వారితో నాకు పరిచయం కలిగింది. నాతో బాగా చనువుగా మాట్లాడేవారు. ఆరోజుల్లో,వారు ఆయన మనవడికి(అని నాకు గుర్తు) అయిదు రోజుల పాటు ఉపనయనం చేసారు. ఆ అయిదు రోజుల కార్యక్రమానికి ,విందుభోజనానికి కూడా నన్ను ప్రేమతో ఆహ్వానించారు. ఉపనయనం చేయించే పురోహితుడు మంత్రాలు చదువుతుంటే,వీరు ప్రతి మంత్రానికి అంతరార్ధం వివరించి చెప్పేవారు . ఆయనకు వైదిక కర్మల మీద అటువంటి పట్టు ఉండేది. అయితే,రోజూ భోజనాలు చేయటం పూర్తి అయ్యేటప్పటికి సాయంత్రం అయిదు గంటలు అయ్యేది!అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి నిన్న(29-4-2014) తన 88 వ ఏట రాజమండ్రీలో అనారోగ్యంతో మృతి చెందటం,వారి కుటుంబానికే కాకుండా —సంగీత,సాహిత్యలోకానికే తీరనిలోటు!ఆ మహానీయునితో నేను గడిపిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ,అశ్రు నివాళిని సమర్పించుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ,ఆ మహనీయుని ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకుంటున్నాను!

  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి

  • ఆసక్తికరమైన, విలువైన సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: