Site icon వసుంధర అక్షరజాలం

అల్లూరి-కృష్ణకి 40 ఏళ్లు

1967లో అసాధ్యుడు సినిమా చూసినప్పుడు- జేమ్స్ బాండ్ తరహా చిత్రాలకు కృష్ణ చాలా బాగున్నాడనే అభిప్రాయం బలపడింది. వి. మధుసూదనరావు దర్శకుడిగా వెలిగిపోతున్న ఆ రోజుల్లో వర్థమాన దర్శకుడిగా వి. రామచంద్రరావు ఇంచుమించు అంత గొప్పగానూ చిత్రాలు తీసేవారు. ఆయన అసాధ్యుడు చిత్రంలో ఒక నాటికలో కృష్ణని అల్లూరి సీతారామరాజు పాత్రలో చూసి- ‘అరే, ఈ పాత్రకూ బాగున్నాడే’ అని ఆశ్చర్యపోయాం.   ఆ తర్వాత 1974లో కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తలపెట్టి తనే ప్రధానపాత్ర పోషించడానికి నిర్ణయించుకుంటే- ‘అయ్యో, ఎన్టీఆర్ ఐతే బాగుండేది’ అనుకున్నాం. చిత్రం విడుదలయ్యాక- కృష్ణ ఆ పాత్రకోసమే పుట్టాడా అనిపించింది. ఈ చిత్రానికీ వి.రామచంద్రరావు దర్శకుడు కావడం గమనార్హం. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ నట జీవితంలో ఒక గొప్ప మలుపు అనిపించుకున్న ఆ చిత్రానికిప్పుడు 40 ఏళ్లు నిండాయి. ఆ సందర్భంగా నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వ్యాసాన్ని ఇక్కడ అందజేస్తున్నాం.

Exit mobile version