మే 3, 2014

అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 9:39 సా. by వసుంధర

ఈ క్రింది సమాచారం అందజేసిన శ్రీమతి నండూరి సుందరీ నాగమణికి ధన్యవాదాలు.

అమెరికా తెలుగు సంఘం (ఆటా) సాహిత్య పోటీల విజేతలు

జూలై 3,4,5 వ తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే 13 వ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక ‘అక్షర’ కోసం ఆటా నిర్వాహకులు సాహిత్య పోటీలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు వందల మంది రచయితలు ఈ పోటీలలో ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు.
ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 4,5 వ తేదీలలో ఆటా మహాసభల ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద బహుమతి ప్రదానం జరుగుతుంది.
ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన వోల్గా, అఫ్సర్, శంకగిరి నారాయణ స్వామి, వంశీకృష్ణ గార్లకు ఆటా మహాసభల సమన్వయ కర్త పర్మేష్ భీంరెడ్డి గారు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు.

కథల విభాగం:

మొదటి మూడు బహుమతులు ($116):
మేస్ట్రుబాబు మరినేరు! – డా.చింతకిందిశ్రీనివాసరావు (విశాఖపట్నం)
విముక్త – వారణాసి నాగలక్ష్మి (హైదరాబాద్)
ఇప్పుడే అందిన వార్త – పెద్దింటి అశోక్ కుమార్ (కరీంనగర్)

కన్సొలేషన్ బహుమతులు ($58):
ఇప్పుడైనా చెప్పనీయమ్మా – జి. ఎస్ లక్ష్మి (హైదరాబాద్)
సర్వం శ్రీజగన్నాథం – ఆనందరావు పట్నాయక్ (రాయగడ)
చందమామోళ్ళవ్వ – రాధ మండువ (చిత్తూరు)
అరచేతి చాటు సూర్యుడు – రాజేష్ యాళ్ల (విశాఖపట్నం)

కవిత్వ విభాగం:

మొదటి మూడు బహుమతులు ($116):
నాలాగే నువ్వూ – మొహన తులసి (చికాగో)
వలసపక్షి – నిషిగంధ (ఫ్లోరిడా)
వీడ్కోలు వేళ – స్వాతీ కుమారి బండ్లమూడి (తిరుపతి)

కన్సొలేషన్ బహుమతులు ($58):
మౌనశిఖరాలెదురైనప్పుడు – పాయల మురళీకృష్ణ (విశాఖపట్నం)
దుబ్బ కాళ్ళు – అన్నవరం దేవేందర్ (కరీంనగర్)
సెల్ఫీ – తైదల అంజయ్య (కరీంనగర్)
పరిమళ భరిత కాంతి దీపం – పెరుగు రామకృష్ణ (నెల్లూరు)

వ్యాసాల విభాగం:
బహుమతులు ($116):
అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం – డా. తన్నీరు కళ్యాణ్ కుమార్ (గుంటూరు)
ఆ ముప్ఫై గంటలు – దాసరి అమరేంద్ర

Leave a Reply

%d bloggers like this: