మే 4, 2014

ఎలుక మెడలో గంట

Posted in సాహితీ సమాచారం at 11:31 ఉద. by వసుంధర

స్వాభిమానమున్నవాడే అసలు సిసలు కవి, రచయిత. తాను మహారాజైనా మహాకవి ‘ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కేలూత నొసగి ఎక్కించుకునేవాడే’ అసలుసిసలు సాహితీప్రియుడు. తమని ‘మనుజేశ్వరాథములని’ నిందించినవాడి వెంటపడి కావ్యాన్ని అంకితమివ్వమని రాయబారాలు పంపేవాడే అసలుసిసలు రసికరాజు. నేటి జనస్వామ్యంలో ఆ రాజులు కాశికా విశ్వేశుని కలిసిపోయారు. వారి స్థానంలో జనసేవ పేరిట పార్టీలు పెట్టి- మంత్రులుగా వచ్చి రాజరికం చెలాయించేవారు అధికారంలో ఉన్నారు. ఈ వ్యవస్థలో  ‘ఏ పార్టీని ఆ పార్టీవాళ్లే తిట్టడం మామూలే. అన్నవాడు బలవంతుడైతే పార్టీ పెద్దలు కిమ్మనరు. బలహీనుడైతే మాత్రం బహిష్కరిస్తామని బెదిరిస్తారు. ఆ బలహీనుడికి వేరే అవకాశం దొరికితే- బెదిరింపుని లెక్క చెయ్యడు. ఇంకే దారీ లేకపోతే మాత్రం-మీడియా తన మాటలు వక్రీకరించిందని తప్పించుకుంటాడు. రుజువుకి వీడియో టేపులున్నప్పటికీ ఆయన్ని మీడియా కూడా పెద్దగా సవాలు చేయదు’. ఈ వాతావరణంలో లాబీలు లేకుండా కవులకు సత్కారాలెలా వస్తాయి. లాబీలతో వచ్చిన ఆ సత్కారాలకు సంతోషించగల స్థాయికి- ఆ కవుల  స్వాభిమానం దిగజారగలదా?

ఈ నేపథ్యంలో మన వ్యవస్థని రాజకీయపరంగా, సాహితీపరంగా విశ్లేషించిన వసుంధర కథ ఎలుక మెడలో గంట నేటి ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలో వచ్చింది. చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. మీ స్పందన మాకు విలువైనది.

ఈ సందర్భంలో కౌముది వెబ్ మాసపత్రికలో  (ఏప్రిల్ 2014) వచ్చిన వసుంధర కథ ఇష్టాయిష్టాలు పై మీ విలువైన స్పందనకోసం కూడా ఇక్కడ లంకె ఇస్తున్నాం.

ఈ కథలు ప్రచురించిన ఆయా పత్రికలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

 

Leave a Reply

%d bloggers like this: