మే 5, 2014

నాట్యతార హెలెన్

Posted in కళారంగం at 9:15 సా. by వసుంధర

కాలేజి రోజుల్నించీ హెలెన్ అంటే నాకు గొప్ప క్రేజ్. తాను ఎక్కువగా క్లబ్ డ్యాన్సుల్లోనే పాల్గొన్నా- ఆమె కదలికల్లో ఒక సొగసు అందర్నీ అకర్షించేది. ఆ తరహా డ్యాన్సులకి ఆమె ఒరవడి పెట్టిందని కూడా చెప్పొచ్చు. చాలా సినిమాలు చాలామంది హెలెన్ కోసమే చూసేవారు. ఆమెకోసం సంగీత దర్శకులు పాటలకి మంచి ఊపున్న వరసలు కట్టేవారు. ఆ వరసలకి ఆమె ఊపు సొగసులు అద్దేది. ఒకటా, రెండా ఎన్నని చెప్పాలి ఆమె పాటలు. నన్ను మొదట ఆకర్శించిన మేరా నామ్ చించించూ (హౌరాబ్రిడ్జ్), ఎన్నటికీ మరువలేని ఆ జానేజా (ఇంతకామ్), ముఖ్యపాత్రలో అద్భుతంగా నటించిన ఇస్ దునియామే (గుమ్నామ్) వాటిలో మచ్చుకి కొన్ని. తెలుగులో సుందరాంగా అందుకోరా (భూకైలాస్) అందరికీ తెలిసినదే.  హెలెన్‍ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారంలో (మే 4) వచ్చిన ఆసక్తికరమైన ఈ వ్యాసం చదవండి.

helen

Leave a Reply

%d bloggers like this: