మే 6, 2014

అక్కినేని కృష్ణుడిగా…..

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:57 సా. by వసుంధర

తెలుగు చలన చిత్రాలలో శ్రీకృష్ణపాత్రధారిగా మొట్టమొదట నేను చూసినది శ్రీకృష్ణతులాభారంలో (1955) రఘురామయ్యని. ఆ పాత్రలో ఆయన తర్వాతనే నందమూరి తారకరాముడైనా అనిపిస్తుంది నాకు. (మచ్చుకి రఘురామయ్యని శ్రీకృష్ణ మాయ చిత్రంలో ఈ విడియోలో చూడండి). ఐతే రామారావుకి ఉన్న గ్లామర్ వేరు. 1957లో వచ్చిన మాయాబజార్ చిత్రంలో ఆయన కృష్ణ పాత్రకే ఒక ప్రత్యేకతని ఆపాదించి- కృష్ణుడంటే ఇలాగే ఉంటాడనిపింపజేశారు. రామారావుకంటే ముందు అక్కినేని 1955లో సంతానం సాంఘిక చిత్రంలో  కాసేపు కృష్ణ పాత్రలో కనిపించారు. కానీ మాయాబజార్ చిత్రం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఇతర నటులు కృష్ణపాత్రను ధరించడానికి ముందుకొచ్చినట్లు అనిపించదు. ఐతే 1977లో వచ్చిన దానవీరశూర కర్ణ చిత్రంలో ఎన్టీఆర్ అక్కినేనిని కృష్ణపాత్ర వెయ్యమని అడిగారుట. వేసి ఉంటే ఆ చిత్రం ఊహకందని మరింత ఘనవిజయం సాధించేది అనిపిస్తుంది. అక్కినేని, నందమూరిలకు సంబంధించిన ఆ ఆసక్తికర విశేషాలు నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చాయి. మీకోసం…

anr as krishna

Leave a Reply

%d bloggers like this: