మే 20, 2014

మనమంతా భారతీయులం

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:03 సా. by వసుంధర

120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మతాలు కొన్నే అయినా- ఒకో పౌరుడికి ఒకో నమ్మకం ఉంది. మన రాజ్యాంగం అందరి నమ్మకాలనీ గౌరవించి పౌరులందరికీ సమాన హోదా కలిపించింది. అలాంటి ఈ దేశంలో కొన్ని రాజకీయ పక్షాలు- ఆ పొరుల్ని కులాలు, మతాలు, వర్గాలు పేరిట వేరు చేసి కొందరికి మైనారిటీలనీ, కొందరికి దళితులనీ ముద్ర వేసి- వారిలో లేని అభద్రతాభావాన్ని ప్రవేశపెట్టి- తాము అధికారంలో కొనసాగుతున్నాయి. జకీర్ హుస్సేన్ మనకు రాష్ట్రపతిగా పని చేశారు. కలాం మన స్పేస్ సైంటిస్టు. ల్దలనాడు దిలీప్ కుమార్, నెడు ముగ్గురు ఖాన్‍లు మన టాప్ సినీ హీరోలు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మన క్రికెట్ కెప్టెన్. జార్జి ఫెర్నాండెజ్ మన రక్షణమంత్రి. స్టాన్లీ రాజశేఖరరెడ్డి తెలుగువారి ముఖ్యమంత్రి.  ఇలా లెక్కలేనన్ని ఉదాహరణలున్నా- కొందరు స్వార్థపరుల ప్రభావం- సామాన్యులకే కాదు, లబ్దప్రతిష్ఠులకూ మనసుల్ని కలుషితం చేస్తూంటుంది. తన అసమాన ప్రతిభతో పౌరులందరి అభిమానాన్నీ చూరగొని, భారత క్రికెట్ కెప్టెన్‍గా 1990లలో ఓ వెలుగు వెలిగిన మహమ్మద్ అజరుద్దీన్ అంతటివాడు కూడా- మ్యాచ్ ఫిక్షిన్గ్ అభియోగానికి గురైనప్పుడు- తను మైనారిటీ వర్గానికి చెందడంవల్ల ఈ అపవాదు వచ్చినట్లు ఓ మాట అని చప్పున వెనక్కి తీసుకున్నాడు. మన కులమతాల్నీ, వర్గాల్నీ, నమ్మకాల్నీ- ఇంటికే పరిమితం చేసి- బయట మనమంతా సమానమే అన్న నిజాన్ని గ్రహించి- సెక్యులరిజం అంటే మతం ప్రసక్తిని పరిమితం చెయ్యడంలోనే- మన అభ్యున్నతి ఉన్నదని అంతా గ్రహించిన గొప్ప సమయం వచ్చింది- యావద్భారతం మోదీకి జేజేలు పలకడంతో. ఐనా ఇంకా కొందరు తమ అహంకారాన్ని వదలలేకో, పాత చింతకాయ పచ్చడి విధానాలమీదనే ఆశ పెట్టుకునో- మోదీ విజయం దేశాన్ని మతపరంగా విభజిస్తుందని అనడం మానలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి సమర్థులు కూడా ఇదే ధోరణినుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు. అటువంటివారికి కనువిప్పు మే 19 ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఈ క్రింది వార్త…

muslims are with modi

1 వ్యాఖ్య »

  1. పదవికోసం పేరు మార్చుకొని, పెళ్ళికోసం మతం మార్చుకొని, ఓట్లకోసం బొట్లు పెట్టుకొని, సీట్లకోసం టోపీలు పెట్టుకొని, అధికారం కోసం అరాచకాలు చేసే గోముఖవ్యాఘ్రాల కాలం చెల్లిందన్న నిజం సాకారమైన వేళ, ఓటుశక్తిని గ్రహించి విదేశీ పాలననుండి స్వఛ్చమైన స్వరాజ్య కాంక్షతో సురాజ్యం కావాలన్న ఆకాంక్షతో కుల మతాలకు అతీతముగ ప్రజలు విజ్ఞతతో ఇచ్చిన తీర్పు కుహనా రాజకీయ వాదులకు చెప్పు దెబ్బ. ఈ విషయాన్ని సోదాహరణముగా చెప్పిన వ్యాసమిది. అభినందనలు.


Leave a Reply

%d bloggers like this: