మే 21, 2014

రెండు మహా రాష్ట్రాలు

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:59 సా. by వసుంధర

పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అతిత్వరలో విడివడనుంది. ఆదిలో సంచలనం పుట్టినా- ఇరుపక్షాల నేతలూ తగిన సంయమనం పాటించడంవల్ల- ఇరు ప్రాంతాలా జరిగిన ఎన్నికలు వైషమ్యాలు లేకుండా శాంతియుతంగా ముగిశాయి. రెండు ప్రాంతాలూ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడ్డం అభినందనీయం. ప్రస్తుతం సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇవ్వడానికి ఎందరో ముందుకొస్తూ- జనానికి స్ఫూర్తినిస్తున్నారు. ఇక తెలంగాణలో- జాతీయ స్థాయిలో అత్యున్నత పదవిని త్యాగం చేసి- ప్రజాసేవకోసం రాష్ట్రానికి తరలివస్తున్న నర్సింగరావు స్ఫూర్తి ప్రత్యేకంగా అభినందనీయం. ఆ వార్తను మీతో పంచుకుంటూ- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు విడిపోయినా కూడా- మళ్లీ రెండు మహారాష్ట్రాలుగా వర్థిల్లగలవని ఆశిస్తున్నాం.

narsinga telangana

1 వ్యాఖ్య »

  1. నూతన రాష్ట్రానికి నవ్య తేజం నవ నవోత్సాహం కలిగించే ఎంచక్కటి ఆచరణీయ మైన ఆమని. ఇది సంకుచిత భావాలతో పొరుగు వారితో పోరి ఉన్న వారిని రెచ్చ గొట్టి సాధించుకున్న సొంత రాష్ట్ర వాసులకు విశాల దృక్పథం తో పరిణతి చెందిన పులకరింత లాంటి పలకరింత. నిస్వార్థ మైన నిజాయితీ కి నిలువెత్తు నీరాజనం, కన్నతల్లికి మాతృ భూమి కి సేవ చేసే సౌభాగ్యం కోసం సొంత లాభం సంపూర్తి గా మానుకుని అందించ బోయే అద్భుత ఆలింగనం.


Leave a Reply

%d bloggers like this: