మే 22, 2014

అరవింద్ క్రేజీవాల్

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:01 సా. by వసుంధర

aravind kనేతల్లో పెరిగిపోతున్న అవినీతిపట్ల ఉద్యమించారు అన్నా. ఆ ఉద్యమ తరంగాల్లో- ఓ పిల్ల కెరటంలా ముందుకు దూసుకొచ్చారు అరవింద్ కేజ్రీవాల్. అన్నా, ఆయన ముఖ్యానుచరులు వద్దంటున్నా వినకుండా- రాజకీయ రంగం ప్రవేశం చేశారు. అవినీతిపరులంటూ- అన్ని పక్షాల్లోంచీ కొందరు నేతల పేర్లెత్తి మీడియాని హోరెత్తించారు. ఆ హోరుకే ముచ్చటపడిన ఢిల్లీ జనం- అంతవరకూ మహానేతలుగా చెలామణీ ఔతున్న నేతల్ని పక్కకినెట్టి- అరవింద్‍ ఆమ్ ఆద్మీ పార్టీ కి ఊహించని విజయాన్ని అందించారు. తనకంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలను బిజెపి గెల్చుకున్నజనాభిప్రాయాన్ని పక్కనపెట్టి- అరవింద్ ప్రజలు తనకే పట్టం కట్టారని భ్రమపడ్డాడు. నిండా అవినీతిలో కూరుకుపోయిందన్న ఆరోపణలు మోస్తున్నకాంగ్రెస్  పార్టీ మద్దతు తీసుకుందుకు జనాభిప్రాయాన్ని కోరాడు. ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రిలా కాక ఉద్యమకారుడిలా ధర్నాలు చేశాడు. పోలీసులతో గొడవ్పడ్డాడు. 49 రోజుల పాలనలోనే అతడు ఎంపిక చేసిన జట్టు సభ్యులపై ఆరొపణలు వచ్చాయి. 49 రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి- వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యతనుంచి తప్పించుకున్నాడు.  ఇంట గెలవక పోయినా- రచ్చ గెలుస్తానని- లోక్‍సభ ఎన్నికల్లో 430 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టాడు. తను నెగ్గడం కంటే వార్తల్లో ఉండడమే ముఖ్యమని- వారణాసిలో నరేంద్రమోదీతో పోటీపడి ఓడిపోయి- ఉట్టికెగరలేనమ్మస్వర్గానికి ఎగరబోయిందన్న సామెతకు ఉదాహరణ అయ్యాడు. అతడి సత్తాపై ఒక అభిప్రాయానికి వచ్చిన ఢిల్లీ జనం లోక్‍సభలో- అరవింద్‍కీ అతడు జతకట్టిన కాంగ్రెస్ పార్టీకీ అక్కడ ఆసరా లేకుండా చేశారు. రచ్చ గెలవాలన్న అతడి ఆశయానికి పంజాబ్ పౌరులు కాస్త ఊపిరి పోసి- నలుగురు ఎంపీలనిచ్చారు.  ఇక కేజ్రీవాల్‍కి మీడియాలో కనిపించే అవకాశం లేదనుకుంటున్న తరుణంలో- ఇప్పుడు పరువు నష్టం కేసులో ఇరుక్కుని- బెయిల్ కూడా వద్దని జెయిల్‍కి వెళ్లాడు.  జనాభిప్రాయానికి ఎక్కువ విలువనిస్తాననే అరవింద్‍కి- మోదీపట్ల జనాభిప్రాయానికి విలువ లేదా? ఆ జనం పిచ్చివాళ్లూ అమాయకులూ అనుకుంటే- తనని ఎన్నుకునే జనం మాత్రం మంచివాళ్లౌతారా?

జాతీయ జ్ఞానపీఠ బహుమతి గ్రహీత అనంతస్వామి, అంతర్జాతీయ నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్- తమ జ్ఞానప్రపంచంలో మునిగిపోయి- అసలు ప్రపంచంతో సంబంధం కోల్పోయి- భారతంలో అత్యధికులు అభిమానిస్తున్న మోదీవంటి నేత గురించి ఏమైనా అనొచ్చు. వారికి జనంతో నిమిత్తం లేదు. కానీ- జనం ఎన్నో ఆశలు పెట్టుకున్న భావినేతల్లో ఒకరైన అరవింద్- ఏక బిగిన జాతి నేతలందర్నీ ద్వేషించడం తగదు. జనం భావాలకు విలువనిచ్చి-  జాతి ముందడుగులో మోదీవంటివారికి అండగా ఉంటూ, తప్పటడుగులు వెయ్యడానికి భయపడేలా చెయ్యడం- అతడి తక్షణ కర్తవ్యం. ఈ విషయమై అన్నా ఉద్యమంలోని కిరణ్ బేడీ వంటి గతంలోని సహచరుల సలహాలు తీసుకోవడం మంచిది. లేకుంటే ప్రస్తుతం కొందరంటున్నట్లు క్రేజీవాల్ అన్న పేరు శాశ్వతమౌతుంది. నేడు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఈ క్రింది కార్టూన్ వంటివి ఆగిపోతాయి. అరవింద్! నీ ప్రతిభకూ, సేవాతత్పరతకూ, నైతిక విలువలకూ జోహారులర్పిస్తూ నీకు అభిమానులైన మేమంతా నీమీద ఎన్నో ఆసలు పెట్టుకున్నాం. జాతికి శుభఘడియలు కనిపిస్తున్న ఈ తరుణంలో మా ఆశలు వమ్ము చేయొద్దని మా అందరి విన్నపం!

cartoon eemadu  

బెయిల్‍పై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలట. …. అనుకూలంగా వస్తేనే బెయిల్ తీసుకుంటాడట.  

 

3 వ్యాఖ్యలు »

  1. chandu said,

    5 vela kotlu karchu petti karchu petti 31 % prajlu matrame amodamu pondhi na modi nee kejriwal nu fallow kavala ..,. devudaaa ee desha prajala nu modi nundi nuvve kapada layaa …

    • ఏంచేస్తాం! కేజ్రీవాల్‍ని ఫాలో ఐనవారే ఆయన్ని వదిలి మోదీని ఫాలో అయ్యారు. మరి కేజ్రీవాల్- జనాభిప్రాయం ప్రకారం నడుచుకునే మనిషి కదా!

  2. శతృత్వంతో మూడు జన్మలలోనే వైకుంఠం చేరాలనుకొన్న జాతికి వారసునిగా చరిత్ర సృష్టించుకొన్న వ్యక్తి అరవింద్. మిత్రవాక్యమును వినని వారు విజ్ఞులు కారు. మైనో పార్టీతో జత కట్టినప్పుడే అతడు క్రేజీవాల్ అన్న పేరు సంపాదించుకొన్నాడు. నిరాశ, నిస్పృహలతో తన రాజకీవ జీవిత సమాధికి తానే రూపకల్పన చేసుకొంటున్నాడు. కళ్ళముందర కనపడు నిజాన్ని చూడక, కలలో బ్రతుకుతున్నవారి జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న అరవింద్ ఇంకా ఏ స్థాయికి దిగజారుతాదో సమీప భవిష్యత్తు నిర్ణయిస్తుంది.
    వాస్తవికతను ప్రతిబింబిచిన మీ వ్యాసమునకు అభినందనలు.


Leave a Reply

%d bloggers like this: