మే 24, 2014
వందనం అభివందనం!
మోదీ ఒక అద్భుత వ్యక్తి కాకపోవచ్చు. కానీ స్వతంత్ర భారతంలో ఒక అద్భుతం చేశాడు. కాంగ్రెసేతర పార్టీకి కూటమిలో కాక- ఏకపక్షంగానూ పూర్తి మెజారిటీ రావడమే ఆ అద్భుతం. ఆ పార్టీ భాజపా- అద్భుతమైనదీ కాదు, కాంగ్రెస్‌కి పూర్తిగా భిన్నమూ కాదు. అవినీతిపరులు, నేరచరితులు, రెండు నాల్కలవారు- అందులోనూ ఉన్నారు. కానీ దేశంలోని రాజకీయ పక్షాలన్నీ ఒక్కటై- ఆ పార్టీని మతతత్వ పార్టీగా ముద్ర వేసి- అంటరాని పార్టీని చేశాయి. సెక్యులరిజం అనే పదాన్ని తమ దుశ్చర్యలను కప్పిపుచ్చే ముసుగుగా వాడుతూ- కొన్ని మతాలవారిని మభ్యపెడుతూ వచ్చాయి. ఆ ముసుగుని తొలగించి, భాజపా అంటరానితనాన్నిపోగొట్టిన మరో అంబేద్కర్ ఆయన. అందువల్ల చాలామంది ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు అభివందనాలు అర్పిస్తున్నారు. వాటిలో విశిష్టమైనది నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వీక్ పాయింట్- మీకోసం….
Sarma KSLKS said,
మే 24, 2014 at 11:14 సా.
చరిత్ర సృష్టించిన నాయకులు కొందరే! వారు సాధించిన విజయాలు చరిత్రలో
శిలాక్షరాలుగా లిఖించబడతై. ఇక దృష్టికోణపు వ్యాఖ్యలు అనేకం. ఎవరు
ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయిన 16.5.2014 రాజకీయపు మలుపు యదార్ధం. కాలం
నిర్ణయిస్తుంది నరేంద్రుని సమర్ధత. ఒకటి మాత్రం స్పష్టం. భజనపరులు, భోజనపరులు
తమ తలలు తన్నేవాళ్ళు తప్పక వస్తారన్న నిజాన్ని ఒప్పుకోవటానికి మరికొంత సమయం
పడుతుంది. ఈ భభోల రభసలో మాతృదేశపు పిలుపు అందుకోవటానికి విదేశీ శక్తులకు
మరికొంత సమయం పట్టచ్చు. నలుపు తెలుపుల సమమేళవింపుగా సాగిన వ్యాసం బాగుంది.