మే 26, 2014
నరేంద్ర విజయం
భారత దేశానికి 15వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి- ఈ ఘటనని పట్టాభిషేకం అని మేమనదల్చుకోలేదు. ఆన్నవారున్నారు కానీ- అప్పుడా పదాన్ని సింబాలిజంగా తీసుకోవాలి. ఇక విజయం అన్న పదాన్ని ఇక్కడ విజయంచేశారు (రాక) అన్న అర్థంలో వాడడం జరిగింది. ఈ విశేషాన్ని నిశ్శబ్ద బ్యాలెట్ విప్లవంగా అపురూపంగా అభివర్ణించింది ఆంధ్రభూమి దినపత్రిక. ఆయన SAARC దేశాధినేతలకు ఆహ్వానం పంపడం కొత్త సంప్రదాయమే ఐనా- ఆయన వ్యక్తిత్వానికి తగిన ప్రత్యేకాహ్వానం మాత్రం ఈ వార్తలో ఉన్నదిః తన ప్రమాణ స్వీకారానికి రావలసిందిగా దేశాధినేతలకు, ముఖ్య రాజకీయ నేతలకు, సినీ అగ్రతారలతో పాటు ఒక చాయ్వాలాకు నరేంద్రమోదీ ఆహ్వానం పంపారు. వడోదర లోక్సభ బరిలో మోదీ నామినేషన్ పత్రాలపై ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ సంతకం చేసిన కిరణ్ మహీదాకు ఈ ఆహ్వానం అందింది. వడోదరలో చాయ్దుకాణం నడిపే కిరణ్ దీనిపై స్పందిస్తూ.. “మోదీ నుంచి ఆహ్వానం అందింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను” అని అన్నారు.
ఇంకా ఆయన బాల్యం, కుటుంబం, ఎదుగుదల గురించి నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసాలు మీకోసంః
Leave a Reply