Site icon వసుంధర అక్షరజాలం

వేణువై వచ్చాను భువనానికి

1953లో ప్రపంచం అనే సినిమా విడుదల పెద్ద సంచలనం కలిగించింది. ఆ చిత్రం విడుదల నాటి ప్రకటన ఆంధ్రప్రభ దినపత్రికలో మొత్తం పూర్తి పేజీ వచ్చింది. రాజమండ్రి శ్యామల టాకీసులో విడుదలైన ఆ చిత్రం రెండే రెండు రోజుల్లో వెళ్లిపోయిందని గుర్తు. ఆప్పుడు నా వయసు 9-10. అన్నయ్య వయసు 10-11. అంత గొప్ప చిత్రం అంత త్వరగా ఎందుకు వెళ్లిపోయిందని అన్నయ్యని అడిగితే- ‘బోలెడు డబ్బు పెట్టి తీశారు. ఎక్కువ రోజులుంచితే థియేటరు వాళ్లు ప్రింట్లు పాడు చేసేస్తారని భయపడి ఉంటారు’ అని అన్నయ్య చెబితే అప్పుడు కామోసనుకున్నాను. ఇప్పుడది గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటాం. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినది సీతారాం అనీ- అందుకే ఆయనకు ప్రపంచం సీతారాం అనే పేరు వచ్చిందనీ- వేణువై భువనానికి వచ్చిన ఆయన ఇటీవలే గాలిగా గగనానికి వెళ్లిపోయారనీ తెలుపుతూ- నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో- వారిని సంస్మరిస్తూ ఒక వ్యాసం వచ్చింది. ఇక్కడ అంతర్జాలంలో లభించే ఆ చిత్రం పాటల పుస్తకానికి లంకె ఇస్తున్నాము. ఆ ప్రకారం ఆ చిత్ర సంగీత దర్శకులు ఇద్దరుః ఎం.ఎస్. జ్ఞానమణి, టి. పూర్ణానందం. వీరిలో ఒకరు సీతారాం అయుందవచ్చునేమో తెలియదు కానీ- ఆ వ్యాసంలో వివరాలు మాత్రం మీతో పంచుకోతగిన అపురూపాలు. వ్యాసకర్తను అభినందిస్తూ- రచనను క్రింద ఇస్తున్నాం.

Exit mobile version