జూన్ 22, 2014

గుర్తింపు (?) కార్డులు

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:55 సా. by వసుంధర

ఒకాయన డాక్టరు వద్దకి వెళ్లి మందులు రాయించుకుని ఫీజు చెల్లింఅాడు- డాక్టర్లు బ్రతకాలి కదా అని. ఆయన రాసిచ్చిన మందులు కొన్నాడు- మందుల షాపులవాళ్లు బ్రతకాలి కదా అని. తర్వాత ఆ మందులు అవతల పారేశాడు- తాను బ్రతకాలి కదా అని. అలాంటివాళ్లు ఉంటారా అని ఆశ్చర్యపోవద్దు.  మన ప్రభుత్వం- పౌరులందరికీ గుర్తింపునివ్వడానికి ఆధార్ కార్డులు తయారు చేయించింది- కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి. అవి గుర్తింపుకా- తయారు చేసినవారు బ్రతకడానికా? మోదీ ప్రభుత్వం ఆధార్ కార్డుకి బదులుగా- మళ్లీ కొత్తగా జాతీయ గుర్తింపు కార్డుల జారీకి చర్యలు తీసుకోనున్నదట. ఆమేరకు హోంశాఖా మంత్రి ఆదేశించారట. అది భావి. గతానికి సంబంధించి- నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన-  ప్రముఖ విప్లవకవి వరవరరావు అనుభవం- మీతో పంచుకోవాలని….

varavararao aj

1 వ్యాఖ్య »

  1. సాంకేతికత సహాయముతో ఈ వోటర్ కార్డులోని వివరములు, ఆధార్ కార్డ్ లోని వివరములు సమ్మిళితము చేసి ఇవ్వదలచుకొన్న జాతీయ కార్డు తయారు చేసే అవకాశము ఉందేమో పరిశీలించిన, ఈ రెండు కార్డులూ ఉన్నవారి విషయములోనైనా ఈ పని అంతవరకు తగ్గునేమో పరిశీలించగలరు.


Leave a Reply

%d bloggers like this: