వసుంధర అక్షరజాలం

ఓ నూలుపోగు

ఆయనది కాంగ్రెస్ పార్టీ. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని వీడలేదు. ఆయన ఇందిర అనుయాయుడు. ఆమెకు ఎన్ని మంచి సలహాలిచ్చినా గుర్తింపు కోరలేదు. ఆయన దేశానికి ప్రధానిగా ఉన్నారు. ఊహకందని కొత్త మలుపులు తిప్పి దేశాన్ని అంతెత్తుకి తీసుకెళ్లారు. ఆయన కారణంగా కాంగ్రెస్ ప్రతిష్ఠ పెరిగినా- కాంగ్రెస్ ఆయన ఘనతను గుర్తించలేదు, ఆయనకు విలువనివ్వలేదు. ఆయన స్థాయి సహచరులు లేకనే నేడు కాంగ్రెస్ పార్టీకి సమూలంగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయన మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు అని ఎవరైనా ఊహించగలరు. ప్రపంచం నివాళులర్పించే ఆ మహనీయుని సంస్మరించడానికి దేశం మాట అటుంచి- తెలుగువారు కూడా సిద్ధంగా లేరు. ఈ సందర్భంలో ఈ క్రింది వార్త ఎంతో సంతోషాన్ని కలిగించింది. మీతో పంచుకోవాలని….

Exit mobile version