జూన్ 28, 2014

నిర్గుణుడికి నిర్దేశమా?

Posted in దైవం at 8:33 సా. by వసుంధర

shirdi sai god aj

ఆంధ్రజ్యోతి జూన్ 28

2 వ్యాఖ్యలు »

  1. ముది మతితప్పిన మాటలను విస్మరించినంత ఉత్తమం లేదు. అటువంటి విషయాలపై చర్చలు, వాదోపవాదనలు, ఖండనలు అనవసరం. ఒక పీఠాధిపతి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడి వుంటే మతి స్తిమితములేదనుకొని విస్మరించుట మేలు.

    • పీఠాధిపతి స్థాయి మనిషి ఐతే అలా అని సరిపెట్టుకోవచ్చు. కానీ పీఠాధిపతి స్థానంలో ఉన్న మనిషి అలా మాట్లాడితే! దేవునిపై నమ్మకం విషయంలో సకల మానవుల అభిప్రాయాల్నీ నిర్దంద్వంగా గౌరవించే హిందూ తత్వానికి ప్రముఖ ప్రతినిధులైన శంకరాచార్యులకు హిందువుల మనసులో దేవుడికున్నంత గౌరవభావముంది. ద్వారకా పీఠాధిపతి వ్యాఖ్య వారికి చిన్నతనం కలిగించేలా ఉన్నది. ఆయన కూడా మానవమాత్రుడే కాబట్టి, పొరపాట్లు మానవ సహజం కాబట్టి- ఇది పొరపాటుగా అంగీకరించడం ఆయన విలువను పెంచుతుంది. మన మధ్య మసలిన మానవాతీత శక్తులున్న వ్యక్తుల్ని- మహనీయులుగా గౌరవించే మేము- వారిని దైవంగా పూజించే సంప్రదాయానికి వ్యతిరేకులమైతే అది వేరే సంగతి. మనిషి దేవుణ్ణి నమ్మడం మానసిక అవసరం అని నమ్మే మేము- పురాణవ్యక్తుల్ని మాత్రమే దైవంగా భావించి పూజించగలం. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం.


Leave a Reply to Sarma Kanchibhotla Cancel reply

%d bloggers like this: