జూలై 1, 2014

మాధ్యమంలో అధమం

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:49 సా. by వసుంధర

channels ab

ఆంధ్రభూమి జూలై 1

2 వ్యాఖ్యలు »

  1. అధమ మాధ్యమాలలో మన తెలుగు ప్రైవేటు మీడియా చానళ్ళు ప్రథమం లో ఉంటాయని శాస్త్రి గారు సోదాహరణం గా వివరించారు. వారు వివరించిన విషయాలలో ఏమాత్రమూ అసంబద్ధము, అవాస్తవము లేవు. మనుషుల దగ్గర్నించి దేవుళ్ళు, దైవారాధన ప్రదేశాలు, దైవాంశ సంభూతుల వరకూ దేనినీ వదల కుండా, ప్రేక్షకుల ఆలోచనలతో ఆడుకుని, వాళ్ళ ప్రాచుర్యం (?) పెంచుకున్నారు(కుంటున్నారు). సున్నిత మైన మనస్సు గల సకల జనులందరినీ సైకో లు గా మార్చడానికి కంకణం కట్టుకున్న కఠోర కసాయిలయ్యారు. అన్నింటికీ వారి ఆశయం, ఆలోచన ఒక్కటే! తిట్టుకుంటూ అయినా తమ చానలే కోరుకుని, జారుడు మెట్ల పై అన్ని విధాలా అధోగతి చేరాలని. ఇలాంటి కుసంస్కార కనికట్టులకి అసలైన అంతం స్వతహా సొంతం చేసుకున్న సంస్కార సాన్నిహిత్యమే తప్ప,బలవంతాన రుద్దే చట్టప్రమేయం ఎప్పటికి తూతూ మంత్రం మాత్రమే.

  2. ద్వా. నా. శాస్త్రి గారు వ్యక్త పరచిన విషయాలు అతి తీవ్రముగా పరిగణించవలసినవే. రాశి పెరుగుతున్నకొద్దీ వాసి తగ్గి దృశ్య మాధ్యమాలలోని కార్యక్రమాలు జుగుప్స గొలుపుతున్నవనటం నిర్వివాదాంశం. ఇక భాష విషయానికి వస్తే తెలుగు భాషామతల్లి కాటుక కంటినీరు ఈ అధునాతనమనుకొనే వారి కటిక బండల వంటి గుండెలను కరిగించదనటంలో ఇసుమంత సందేహములేదు. ఈ వ్యధను ఆ ప్రసార మాధ్యమముల అధిపతులు గ్రహించి మన సంస్కృతిని, మన సంప్రదాయాలను, మన భాషను ప్రతిబింబిస్తూ సమాజ శ్రేయస్సుకు తమవంతు కృషి సలపాలని ఆకాంక్ష . ద్వా . నా . శాస్త్రిగారిలాంటి మేధావులు జనాన్ని చైతన్య వంతులు చేయుటకు నిరంతర కృషి చేయవలసిన సమయము ఆసన్నమైనట్లు తోచుచున్నది.


Leave a Reply

%d bloggers like this: