జూలై 1, 2014

ముప్పై రోజుల తెలంగాణ ప్రభుత్వం

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:30 సా. by వసుంధర

కొత్త రాష్ట్రం తెలంగాణలో కొత్త ప్రభుత్వం నెల రోజుల పాలన పూర్తి చేసుకుంది. కెసిఆర్ వ్యతిరేకులు ఎన్నికల వాగ్దానాల అమలు చెయ్యకపోవడం గురించి ఆయన్ను దుయ్యబట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన తీసుకున్న కొన్ని చర్యలు తెలంగాణ సెంటిమెంటుని ఎంతలా తృప్తి పరిచినదీ చెబుతుంది- నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఆసక్తికరమైన ఈ వ్యాసం. వ్యాసకర్త అభిప్రాయాలతో మేము చాలావరకూ ఏకీభవిస్తున్నాం. ఐతే 35 సంవత్సరాలు ఒరిస్సాలో కేంద్ర ప్రభుత్వోద్యోగిగా పని చేసిన మాకు- మ దేశంలో కులం, మతం, భాష, యాస సెంటిమెంటు ఎక్కువై- ఆర్థిక అసమానతని సుస్థిరం చేస్తోంది. మనం పరాయి దేశస్థులుగా అమెరికా వెళ్లి ఐదేళల్లో అక్కడి పౌరులమై- వారి సంస్కృతిలోనూ అక్కడి జనజీవనస్రవంతిలోనూ కలిసిపోతున్నాం. మన దేశంలో ఐతే పాతికేళ్లుగా మనతో ఉంటున్న మన దేశస్థుల్ని, మన భాష మాట్లాడేవాళ్లని మనవాళ్లుగా భావించలేకపోతున్నాం. ఈ సంకుచితత్వంనుంచి బయటపడితే- ఆర్థికంగా వెనుకబడిన వారందరూ ఒక్కటై- బలవంతుల, భాగ్యవంతుల పెత్తనంనుంచి కూడా బయటపడి బాగుపడతాం. కొత్త ప్రభుత్వం సెంటిమెంటుకంటే- పేదరికం నిర్మూలనపైన ఎక్కువ దృష్టి పెడుతుందని ఆశిద్దాం. 67 సంవత్సరాల అనుభవం చెబుతోంది- సెంటిమెంటు కూడు పెట్టదని. మనకి సాటి సామాన్యులకంటే మన నేతలే ఎక్కువ అన్యాయం చేస్తున్నారన్న సత్యాన్ని ఆమోదించడం- ఇప్పుడొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందుకు ఎంతైనా అవసరం.

కెసిఆర్ పివి విషయంలో తీసుకున్న నిర్ణయం- యావద్భారతానికీ సంతోషాన్నిచ్చింది. బోనాల్ పండుగ విషయంలో తీసుకున్న నిర్ణయం తెలంగాణ మొత్తాన్ని పరవశింపజేసి- ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైంది. ఆమేరకు ఆయనకు అభినందనలు!

telangana astitvam ab

4 వ్యాఖ్యలు »

 1. hari.S.babu said,

  నెల రోజుల్లో భూనభోంతరాళాలు బద్దలవుతాయని ఆశించలేదు గానీ పని తీరు యెలా వుంటుందో తెలిసింది.

  1.విధ్యార్ధి అయినా వుద్యొగి అయినా స్థానికత గురించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోనూ రాజ్యాంగంలోనూ వున్న వాటికి బదులుగా ఫీస్ రీ ఇంబర్స్మెంట్ కి మాత్రం తండ్రి పుట్టుక అనే కొత్త ప్రతిపాదన తెచ్చారు.విధ్యార్ధికి సంబంధించిన అతి ముఖ్యమయిన స్థానికతకు సంబంధించిన సాంకేతిక వివరాలకు విరుధ్ధంగా వున్నందువల్ల చెల్లకుండా పోతే?
  2.విడిపోయి కలిసుందామని సుద్దులు చెప్పిన వాళ్ళు సచివాలయంలోనే బ్యారికేడ్లు కట్టేశారు.మాకు తెలీదు గవర్నరు కార్యాలయం చేసింది అనేశారు స్కూలు పిల్లల్లాగ.గవర్నరు కార్యాలయం వాళ్ళు కూడా మేము కట్టలేదంటున్నారు, మరి కాకులు కట్టాయా పిల్లులు కట్టాయా?
  3.నీటి పారుదలకి సంబంధించిన వ్యవహారాలన్నీ గవర్నరు కార్యాలయం ద్వారానే నడవాలని నిబందనల్లో వున్నా కృష్ణా దెల్టాకు మంచి నీళ్ళకి కూడా అడ్దం పడుతున్నారు,అదేమంటే ఆంధ్రోళ్ళు సాగునీరుగా వాడుకుంటున్నారని అక్కడి నుంచే ఇక్కడ జరుగుతున్నదేంటో చూసినట్టుగానే మాట్లాడు తున్నారు.
  4.ఒకప్పుడు ఆంధ్రోళ్ళు “మావన్నీ మాకే, మీవి కూడా మాకే” అనే విధంగా మమ్మల్ని దోచుకున్నారు అన్నవాళ్ళు ఇవ్వాళ కరెంటు విషయాని కొచ్చేసరికి “మా కరెంటు మాకే, మీ కరెంటు కూడా మాకే” అంటున్నారు.చాలా గంభీరమయిన నైతికాంశాల్ని కూడా లేవనెత్తుతున్నారు.
  5.కరెంటు విషయంలో మాత్రం ఆంధ్రా అభ్యంతరాల్ని పట్టించుకోకుండా బిల్లులేని అంశాల్ని మక్కీకి కి మక్కీ గా అమలు చెయ్యాలట, పోలవరం విషయంలో మాత్రం తెలంగాణా అభ్యంతరాలకి విలువ నిచ్చి డిజయిను వారు చెప్పినట్టుగా మార్చాలట!
  6.ఆర్భాటంగా ల్యాంకో హిల్ల్స్ మీదకి వెళ్తే అక్కడ సహేంద్ర తక్షకాయ స్వాహా అన్నట్టు మైక్రోసాఫ్ట్ లాంటివి కూడా పక్కనే వున్నాయని తేలింది.వాళ్ళని బయటికి లాగాలంటే తామే పరిహారం ఇస్తే తప్ప కుదరదు,వారు ముందు చెప్పినట్టుగా అవి వక్ఫ్ భూములు అనే వాదనకి కట్టుబడితే తామివ్వాల్సింది ఒంకా తడిసి మోపెడవుతుంది!ప్రస్తుతానికి కిమ్మనకుండా వుండి పోవటమా దొడ్డిదారిన వెళ్ళటమా యేది శ్రేయస్కరం?
  7.పాత భవంతుల్ని కూలుస్తున్నారని దాదాపు పూర్తి కావచ్చే మెట్రో పనుల్ని అర్ధాంతరంగా నిలిపెయ్య మన్నారు,దాని వల్ల చేసే పని మధ్యలో ఆపడం ద్వారా లార్సన్ అండ్ టబ్రో వాళ్లకి యెంత నష్టం?అది వాడు భరించడే, మళ్ళీ పని మొదలెట్టినప్పుడో మరొకప్పుడో ప్రభుత్వం దగ్గిర్నుంచే వసూలు చేస్తాడు గదా!
  8.విభజన జరిగిన తీరు చూస్తే చేసిన వాళ్లకి ఇంతకు ముందు రాష్ట్రంలో తేంగాణాతో పాటూ ఆంధ్రా రాయల సీమా అనే మరో రెండు ప్రాంతాలు కూడా వుండేవి అని గానీ విడిపోయాక కూడా అవి వుండాలని గానీ అనే అవగాహన వున్నట్టు కనిపించదు.యేది పడీతే అది వేసెయ్ తెలంగాణాకే, అక్కడ పడే వోట్ల వర్షంతో ప్రధాని పదవి రాహు బాబుకే అన్నట్తు రెచ్చిపోయారు.ఆఖరి నిముషాల్లో వెంకయ్య నాయుడు నోతి మాటగా కొన్ని హామీలు రాబట్టాడు గాబట్టి ఆంధ్రా ఈ మాత్రమయినా ధెమ్మాగా వుంది, లేకపోతే?నోటి మాటే తప్ప నికరమయిన హామీలు కాదని వొకవైపున యేదుస్తుంటే వాటికి కూడా వై మాకూ కావాలి అని పోటీకి తగులుకున్నారు, అవి కూడా రాకుండా చెయ్యటానికి!.
  9.రెండున్నర జిల్లాలోళ్ళు అనే వంకర కూత వొచ్చినప్పుడే తెలివి తెచ్చుకుని జవాబు చెప్పకుండా ఆ మాట అన్నందుకా అన్నట్టు ప్రజాకవనీ మహాకవనీ మోసినందుకూ, ఇన్నేళ్ళ నుంచీ వుద్యమం యే తీరుగా జరుగుతుందో చూసి కూడా విబజన తప్పదని తెలుసుకోకుండా హైదరాబాదు ఆదాయంలో తమ న్యాయమయిన వాటా గట్టిగా అడగకుండా తెల్ల మొహాలేసుకుని చూసినందుకు ఆంధ్రోళ్లకి ఈ శాస్తి జర్గాల్సిందే గానీ ఈ రకంగా జరిగిన గందరగోళపు విభజన వల్ల తెలంగాణా కూడా నష్టపోతుందని యెంతమందికి తెలుసు?విభజనకి ముందు ప్రతిపాదించబడి నిర్మాణం మొదలయిన నీటి పారుదల ప్రాజెక్టులు యెన్నో వున్నాయి.వాటికి అప్పుడు అవిభక్త రాష్ట్రం నుంచి వచ్చినంత కేటాయింపులు ఇప్పుడు కొత్త రాష్ట్రం నిక్కచ్చిగా చెయ్యగలదా?ఇష్తం లేని వాళ్ళని పరిహారాలిచ్చి బయటికి పంపడానికీ,జరుగుతున్న పనుల్ని హఠాత్తుగా అపేసి తీరిగా మొదలు పెట్టటానికీ, ధారాళంగా యెక్కణ్ణించయినా సరే యెంత ఖర్చయినా సరే నని కరెంటు కొనడానికీ యెంత ఖర్చవుతుంది?ఇప్పుడు పంపకాలు పూర్తయ్యాక తెలంగాణా వార్షికాదాయం యెంత?వీటన్నింటికీ అయ్యే ఖర్చు ఆదాయాన్ని మించితే కొత్త ఆదాయ మార్గాలు యేమిటి?
  10.ఈ ప్రశ్నల్లో వేటికయినా నికరమయిన జవాబు వుందా ముఖ్యమంత్రి గారి నుంచి గానీ ఇక్కడ బ్లాగుల్లో తిరుగుతున్న వీర తెవాదులకి గానీ?

  ఆవిడెవరూ “విడిపోతే చాలు గుగ్గిళ్ళయినా తిని బతుకుదాం గానీ ఈ ఆంధ్రోళ్ళతో మాత్రం కలిసుండకూడదు” అనేసింది.ఆవిడ కేం ఖర్మ గుగ్గిళ్ళు తినడానికి?తండ్రీ భర్తా కోట్లకి పడగ లెత్తి వున్నారు!ముఖ్యమంత్రిగా శ్రీమాన్ కచరా గారు చేసే ఈ మహాద్భుత కార్యాల్ని చూసి సంబరంగా తెలంగాణా ప్రజలు తింటారు ఇనప గుగ్గిళ్ళు!!

 2. భాష పేరుతొ రాష్ట్రంలోని ప్రజలు వేరు చేయడం ఇకనయినా ఆగిపోతుందనీ, తెలంగాణాలో ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, గోండీ, బంజారా తదితర భాషలు మాట్లాడేవారికి తగు స్థానం లభిస్తుందని కోరుకుందాం. ఎవరెస్టు శిఖరంపై తెలంగాణా జెండా ఎగిరేసిన బంజారా బాలిక మలావత్ పూర్ణ ఈ గంగా జమునీ తెహ్జీబ్ యొక్క గొప్పదనానికి నిదర్శనం.

  • మీ స్పందనకు ధన్యవాదాలు. పూర్ణ వివరాలు అక్షరజాలంలో కూడా ఇచ్చాం. లంకెః https://aksharajalam.wordpress.com/2014/06/13/%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81-%E0%B0%AA%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%A4%E0%B0%82-%E0%B0%B5%E0%B1%86%E0%B0%A8%E0%B1%81%E0%B0%95-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A4/

  • hari.S.babu said,

   @jai
   భాష పేరుతొ రాష్ట్రంలోని ప్రజలు వేరు చేయడం ఇకనయినా ఆగిపోతుందనీ
   >>
   భాష ప్రజల్ని వేరు చెయ్యడం అంటే యేమిటి?
   >>
   “తెలంగాణాలో ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, గోండీ, బంజారా తదితర భాషలు మాట్లాడేవారికి తగు స్థానం ” యే విధంగా లభిస్తుందో కొంచెం వివరంగా చెప్తారా?
   >>
   ఈ మాత్రం యెవరికి ఇష్టమయిన భాష వాళ్ళు మాట్లాడుకోవటానికి కూడా ఆంధ్రా వాళ్ళు అడ్డు పడ్డారా?మరి మీరు కొత్తగా రాసుకున్న రాష్ట్ర గీతం లో ఈ గంగా జమునీ తెహజీబ్ లేకుండా పాత తెలుగు వాసనే వేస్తుందేం?!


Leave a Reply

%d bloggers like this: