జూలై 2, 2014

మన సినిమాల్లో అశ్లీల గీతాలు

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:07 సా. by వసుంధర

సినిమాని కళ అంటారు కానీ- అది వ్యాపారం. అందులో పాటలు, మాటల్లో అశ్లీల ద్వంద్వార్థాలు- మాకు తెలిసి- ఎయన్‍ఆర్ నటించిన శ్రీలక్ష్మమ్మ (1950 కాబోలు) నాటికే మొదలయ్యాయి. మనం మహానటులుగా చెప్పుకుంటున్న అక్కినేని, నందమూరి, ఎస్వీఆర్‍లు కూడా దీనికి మినహాయింపు కాదు. ఆత్రేయతో పాటు పలువురు పేరున్న కవులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. 1970లలో కాబోలు వచ్చిన కత్తుల రత్తయ్య చిత్రంలో ఎత్తుకుంటావా నన్నెత్తమంటావా అన్న పాట ఒక మహాకవి వ్రాసినదని గుర్తు. ఆ పాట ఎస్వీఅర్- ‘ఊ , ఎత్తు’ అనడంతో మొదలౌతుంది. ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందజేసే ఈ రంగం సఫలతకు ఎక్కువగా దిగువ మధ్యతరగతి జనాలపై ఆధారపడి ఉండడం, ఆ జనాల అభిరుచిపై సినిమావారికి ఖచ్చితమైన అభిప్రాయం ఉండడం- ఈ తీరుకి కారణం. మన మహానటుల్నీ, మహాకవుల్నీ- వీటితో అంచనా వెయ్యలేము. వీటి కారణంగా తప్పూ పట్టలేం. ఐతే గతమంతా సభ్య సంస్కారాలకు నిలయమని పొరపడవద్దని చెప్పడానికే- గతానికి సంబంధించిన అసంఖ్యాక ఉదాహరణల్లో ఒకటి మాత్రం ప్రస్తావించాం. ఈ తీరు నేటి చిత్రాలకు మాత్రమే పరిమితం అన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యతిరేకిస్తూ అశ్లీల గీతాలపై ఆవేదన వెలిబుచ్చిన ఈ వ్యాసాన్ని (ఆంధ్రభూమి జూలై 2) మీతో పంచుకుంటున్నాం.

bootu patalu ab

4 వ్యాఖ్యలు »

  1. shankarvoleti said,

    అన్నమయ్య లాంటి కవులు కూడా పాటంతా శ్రంగారం (బూతులు) రాసి..ఆఖర్లో శ్రీ వెంకటెశా అని తగిలించగానే అది భక్తి గీతమై ఎలా కూర్చుందో ..నాకైతే అర్ధం కాదు..

    • ఇలాంటి సందేహాలు తరచుగా అడుగుతూండేవే. వాటికి ఇప్పటికే ఎందరో భక్తి వేదాంతపరంగా సమాధానమిచ్చి ఉన్నారు. లౌకిక పరంగా మా అవగాహన, శక్తి సామర్ధ్యాలమేరకు భక్తిని విశ్లేషిస్తూ- కౌముది వెబ్ పత్రికలో భక్తిగిరి పేరిట మా వ్యాసాలు ధారావాహికంగా వచ్చాయి. వాటికి లంకెః https://aksharajalam.files.wordpress.com/2012/06/bhaktigiri_koumudi.pdf
      ఈ లంకెలో ప్రత్యేకంగా మీ ప్రశ్నకు 46-48 పేజీలలో జవాబు లభిస్తుంది. 49వ పేజీలో ఉన్న మా జగన్మాత కథ కూడా ఇదే అంశాన్ని విశ్లేషించింది. వీలునిబట్టి చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.


Leave a Reply

%d bloggers like this: