జూలై 8, 2014

పిట్ట తగవూ పిట్ట తగవూ

Posted in సాంఘికం-రాజకీయాలు at 8:28 సా. by వసుంధర

తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. తెలుగు భాష వైభవం రెండింతలై వర్ధిల్లాలని ఆశ. పిట్ట తగవూ పిట్ట తగవూ పిల్లి తీర్చినట్లు కాకూడదని ఇరు రాష్ట్రాలకూ విన్నపం. దానికి హెచ్చరికగా నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ వార్త….

piTta tagavoo piTta tagavoo

2 వ్యాఖ్యలు »

  1. hari.S.babu said,

    నూతనంగా యేర్పడిన తెలంగాణా ప్రభుత్వ వైఖరీ వుద్యమ కాలం నుంచీ ప్రభావ శీలురయిన మేధావుల తీరూ తెలంగాణాని బాగు చేసుకోవడం కన్నా ఆంధ్రాని యెలా దెబ్బ తియ్యాలా అనే దాని మీదే దృష్టి పెట్టినట్టుగా వుంది వారి వ్యవహార శైలి చూస్తుంటే.

    కృష్ణా డెల్టాకు నీటి విషయంలోనే జలసంఘంలోని అధికారులే కావాలంటే మీకూ అడగండి,అంతే కానీ అంతా నిండే వరకూ నీళ్ళు వదలబోమంటే యెలా అంటున్నా వినిపించుకోకుండా ఆంధ్రాకు వాటాయే ఇవ్వదల్చుకోనంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు!

    మనుషుల్లో యెంత దుర్మార్గుడయినా యెదటివాడికి మంచి నీళ్ళు ఇవ్వని వాడు వుండదంటారు, మరి ఇదేమి చిత్రమో మాకు అన్యాయం జరిగిందని పోరాడిన వాళ్ళు ఇవ్వాళ ఇంత అన్యాయానికి తెగబడుతున్నారు?సాటి వాళ్ళకి మంచినీళ్ళ సాయమే చెయ్యని వాళ్ళు భాషని గురించి సాయాని కొస్తారా?

  2. తెలుగుతల్లి, తెలంగాణా తల్లి – ఈ ఇద్దరు తల్లులకు మధ్య బాంధవ్యమేమి ? తెలిసి చెప్పకపోయిన నీ తల్లి తల మరొక చెక్క అవుతుందన్న చందముగా ఉన్నది. ఈ పరిస్థితి కల్పించిన పరదేశపు పెద్దమ్మ వేసిన చిక్కుముళ్ళలో దారితెన్ను కనపడని నాయకమ్మన్యులకు ఈ విషయముపై దృష్టి పెట్టే సమయము కలదా? భాషాప్రయుక్త రాష్ట్ర స్ఫూర్తి కొడిగట్టి, కొండెక్కినవేళ, భాషకు పట్టిన దుర్గతిగూర్చి అరిచే అరుపులు బధిర శంఖారావలే అవుతాయి. “ఏవి తల్లీ ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములేవి తల్లీ……..” అన్న గీతమే మన భాషా గీతం. కడు శోచనీయము.


Leave a Reply

%d bloggers like this: